“భారతదేశం విషయం లో నేను అతి పెద్ద ఆశావాది ని. భారతదేశం భవిష్యత్తు విషయం లోను, ప్రధాన మంత్రి శ్రీ మోదీ కనబరుస్తున్న దార్శనికత, అది దేశం లోని ప్రతి పౌరుని కి లబ్ధి చేకూర్చే విషయంలోను నాకు నమ్మకం ఉంది. యుఎస్ ఐ ఎస్ పి ఎఫ్ చైర్ మన్ గా భారతదేశంష, అమెరికా సిఇఒ ల అభిప్రాయాల ను నేను దగ్గర గా చూశాను. ప్రధాన మంత్రి శ్రీ మోదీ దార్శనికత పట్ల, భారతదేశం పట్ల వారు కనబరిచిన ధీమా నాకు తెలుసు. భారతదేశం తో నా ప్రయాణం సాగిన ఈ 40 ఏళ్ల లో ఇప్పుడు భారతదేశం చాలా బలం గా కనిపిస్తోంది. అద్భుతమైన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వం లో ఆవిష్కారం కానున్న న్యూ ఇండియా భవిష్యత్తు లో పోషించబోతున్న పాత్ర ను గురించి రాబోయే ఐదేళ్లలో ప్రపంచానికి చాటాలని అందరి ని నేను కోరుతున్నాను.”