“ఎఐఐబి లో భారతదేశం రెండో అతి పెద్ద షేర్ హోల్డర్ గా ఉన్న ప్రధాన భాగస్వామి. గుజరాత్, మధ్య ప్రదేశ్, ఆంధ్ర ప్రదేశ్ లలో గ్రామీణ రహదారుల నిర్మాణానికిగాను మా బ్యాంకు నిధుల ను అందజేసింది. తద్వారా గ్రామీణ ప్రజలకు, విపణుల కు మధ్య దూరం తగ్గింది. మా బ్యాంకు కు కొండంత అండ గా నిలచారు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. చైనా నాయకుడు శ్రీ శీ తో ఆయన కు ఉన్న వ్యక్తిగత స్నేహం ఉభయ దేశాల మధ్య స్నేహాన్ని బలోపేతం చేసింది. ఇది బ్యాంకు నిర్వహణ లో స్పష్టంగా కనిపిస్తోంది.”