శ్రీ జెఫ్ ఇమ్మెల్ట్, జిఇ చైర్మన్ మరియు సిఇఒ
మొట్టమొదటి సారి నేను అటు తయారీదారు, ఇటు ఎగుమతిదారు కాగల సామర్ధ్యాన్ని గమనిస్తున్నాను.  మనం డిజిటల్ యుగంలో జీవిస్తున్నామని నేననుకొంటున్నాను.  భవిష్యత్తులో, భారతదేశం వినియోగదారుల ఇంటర్ నెట్ దృష్టికోణంలోనే కాక పారిశ్రామిక ఇంటర్ నెట్ దృష్టికోణంలో నుండి కూడా అతి దృఢమైన డిజిటల్ దేశంగా కాకపోయినా అతి దృఢమైన డిజిటల్ దేశాలలో ఒకటిగా ఆవిర్భవించగలదు.  ఈ కారణంగా 21వ శతాబ్దంలో ఉత్పాదకతపరంగా పెద్ద స్తంభాలకేసి నేను చూసినప్పుడు ముందు నడిచే అవకాశం భారతదేశానికి ఉందనిపిస్తోంది