“గుజరాత్ లోని మా రిఫైనరీ సంస్థ ల ద్వారా, దేశవ్యాప్తం గా వున్న రీటైల్ అవుట్ లెట్స్ ద్వారా వేలాది మంది భారతీయుల కు ఉపాధి కల్పిస్తున్నాం. ఉపాధి కల్పన పై ప్రధాన మంత్రి ఆకాంక్షల కు అనుగుణం గా కృషి చేస్తున్నాం. భారతీయ ఎంఎస్ ఎంఇ ల కు చెందిన వందలాది భారతీయుల కు వ్యాపార అవకాశాల ను కల్పించడం ద్వారా ఉపాధి కల్పన జరుగుతోంది. అంతే కాదు ముఖ్యమైన సిఎస్ ఆర్ కార్యక్రమాల ను ప్రారంభించడం ద్వారా కూడా ఈ పని ని చేస్తున్నాం. భారతదేశం తో భాగస్వామ్యాన్ని కొనసాగించడానికి వీలు గా ప్రధాన మంత్రి ఇస్తున్న సహాయ సహకారాల కు మా హృదయపూర్వక కృతజ్ఞతలు.’’