శ్రీ దిదియ‌ర్ క‌సిమిరో, వైస్ ప్రెసిడెంట్, రిఫైనింగ్‌, పెట్రోకెమిక‌ల్, కామ‌ర్స్ & లాజిస్టిక్స్‌, రాస్ నెఫ్ట్
“వైబ్రంట్ గుజ‌రాత్ స‌ద‌స్సు అనేది పెట్టుబ‌డుల‌ ను ప్రోత్స‌హించే స‌ద‌స్సు స్థాయి నుండి భార‌త‌దేశం తో చిర‌కాలం భాగ‌స్వామ్యం కొన‌సాగింప చేయ‌గ‌లిగే వేదిక‌ గా మారింది. ఈ ప‌ని గుజ‌రాత్ ద్వారా జ‌రుగుతోంది. 2030వ సంవత్సరానికల్లా భార‌త‌దేశం ప్ర‌పంచం లో మూడు అతి పెద్ద ఆర్ధిక వ్య‌వ‌స్థ‌ల్లో ఒక‌టి గా రూపొందడానికి స‌రైన విధం గా కృషి జ‌రుగుతోంది. భార‌త‌దేశాని కి చెందిన ప్ర‌భావ‌వంత‌మైన‌, గౌర‌వ‌నీయులైన నేత ఒక‌ సారి ఇలా అన్నారు.. సాఫ్ నీయ‌త్‌, స‌హీ వికాస్ (పరిశుద్ధమైన మనస్సాక్షి , స‌రైన ప్ర‌గ‌తి) అని. ”