“భారతదేశం సాధించిన ప్రశంసనీయమైనటువంటి ఆర్ధిక వృద్ధి ని, అది ప్రపంచ ఆర్ధిక రంగ వృద్ధి కోసం చేసిన కృషి ని వైబ్రంట్ గుజరాత్ సదస్సు చాటుతోంది. ఈ సదస్సు కు రూపకల్పన చేసి విజయవంతం చేస్తున్నందుకు, దార్శనికత ను కనబరుస్తూ దేశం లోని ఆవిష్కరణ శక్తి సాయం తో భారతదేశాన్ని మంచి భవిష్యత్తు లోకి నడిపిస్తున్న నా స్నేహితుడు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి అభినందనలు. గత ఏడాది నా భారతదేశ పర్యటన ను, ముఖ్యం గా గుజరాత్ పర్యటన ను, అక్కడ నాకు లభించిన స్వాగత సత్కారాల ను నేను ఏనాడూ మరచిపోను. గతం లో ఎన్నడూ లేనంత గా ఈ రోజు న ఉభయ దేశాల మధ్య సహకారం బలం గా ఉంది. రెండు దేశాలు కలిసికట్టు గా పని చేయడం వల్ల అపారమైన అవకాశాలు మన ముందు ఉన్నాయి.”