శ్రీ ముకేశ్ అంబానీ, చైర్ మన్‌, రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్
“ఎంతో విశిష్ట‌మైన‌టువంటి వైబ్రంట్ గుజ‌రాజ‌త్ స‌ద‌స్సు విజ‌య‌వంతం కావ‌డం, దీని ప్ర‌భావం ప‌లు రాష్ట్రాలలో ప్ర‌తిఫ‌లించ‌డం వెనుక ఉన్న కృషి నిస్సందేహం గా ప్రధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ దే. ఈ ఘ‌న‌త ఆయ‌న‌ కే చెందుతుంది. గుజ‌రాత్ ముద్దు బిడ్డ‌, భార‌త‌దేశ దార్శ‌నికుడు, మ‌న ప్రియ‌త‌మ ప్రధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ నాయ‌క‌త్వం లో ప్ర‌పంచ ఆర్ధిక‌ రంగం లో భార‌త‌దేశం చాలా వేగం గా అభివృద్ధి చెందుతోంది. ప్రధాన మంత్రి శ్రీ మోదీ మాట‌ల ప్రధాన మంత్రి కాదు, చేత‌ల ప్రధాన మంత్రి అనే విష‌యాన్ని యావత్తు ప్ర‌పంచం గుర్తించింది.”