ప్రధాన మంత్రి తీసుకొన్న ఈ నిర్ణయాన్ని మేము మెచ్చుకొంటున్నాము. ఇది ఎంతో ధైర్యం గల, సాహసంతో కూడిన చర్య అని నేను అనుకుంటున్నాను. చాలా దేశాలు.. 500 యూరో నోట్ చెలామణిని రద్దు చేయడం గురించి యూరోప్, అలాగే 100 డాలర్ బిల్ విషయంలో యుఎస్ ఎప్పటినుండో ఆలోచనలు చేస్తున్నాయి. ప్రధాన మంత్రి తీసుకొన్న చర్య దారి చూపే చర్య అని, ప్రపంచంలోని మిగిలిన దేశాలు అచిర కాలంలోనే ఈ దారిని అనుసరిస్తాయని నేను అనుకుంటున్నాను