“యూరోప్ కార్యకలాపాల కోసం రెండు వందల భారతీయ కంపెనీలు నెదర్లాండ్స్ ను ఎన్నుకోవడం మాకు ఎంతో గౌరవం గా ఉంది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఒక సారి ఇలా అన్నారు.. కలిసి నడుద్దాం, కలిసి ప్రగతి సాదిద్దాం, కలిసి ఆలోచిద్దాం, సమస్యల్ని కలిసికట్టు గా పరిష్కరిద్దాం, ఐకమత్యంగా నిలబడి ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోదాం అని. ఆ విషయం తో నేను ఏకీభివస్తున్నాను. మనం ఐకమత్యం గా వుండి పని చేస్తే భారతదేశం, నెదర్లాండ్స్ లు ప్రగతి ని సాధించడమే కాకుండా మన ఉమ్మడి సుస్థిర లక్ష్యాల ను కూడా సాధించుకోగలం”