“యునైటెడ్ స్టేట్స్ వాణిజ్య భాగస్వామ్య దేశాలలో మొదటి పది అతి పెద్ద దేశాల్లో భారతదేశం ఒకటి. ఈ విషయం లో వేగం గా ముందుకు పోతోంది. భారతదేశ ప్రజలు చేత లు కావాలని, ధైర్యం గా వ్యవహరించే నాయకత్వం కావాలని కోరుకుంటున్నారు. అవి శ్రీ నరేంద్ర మోదీ లో ఉన్నాయి. ఆయన తో కలసి పని చేయడం మాకు ఎంతో గర్వ కారణం. భారతదేశం, యునైటెడ్ స్టేట్స్ ల ముందు అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి.”