‘‘ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ యొక్క క్రియాశీలత్వం, ఆయన ప్రభుత్వం యొక్క హుషారుతనం మరియు చేయగలుగుతామనే ధోరణి ప్రేరణ ను అందించేవే. ఆయన నాలుగు సంవత్సరాల క్రితం ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ లో సాధించ లేనటువంటిదిగా తోచిన లక్ష్యాన్ని పెట్టుకొన్నారు. మరి ప్రస్తుతం వారు దానిని సాధించ గలిగేటంత సమీపం లోకి వచ్చేశారు. జిఎస్‌టి, ఇంకా ఇన్‌సాల్వన్సి అండ్ బ్యాంక్‌రప్టసి కోడ్ ల వంటి ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొన్ని పరివర్తన పూర్వక సంస్కరణ లు ర్యాంకుల ను పూర్తిగా ప్రభావితం చేయవలసి ఉన్నప్పటికీ కూడా ఈ సంస్కరణల లో ఒక పయన గతి ఏర్పడడాన్ని నేను గమనించ గలుగుతున్నాను. ప్రధాన మంత్రి అందిస్తున్న సరైన మార్గదర్శకత్వం, తీసుకొంటున్న సరైన చర్యల తో మనం కేవలం చిన్న చిన్న అడుగులు కాకుండా అదే విధమైన పయన గతి ని మనం గమనించవచ్చని నేను అమిత ఆశా భావం తో ఉన్నాను. ’’