‘‘ ప్రస్తుత కాలం లో అన్ని దేశాలు భారతదేశం లో పెట్టుబడులు పెట్టడానికి చూస్తున్నాయి. దీనికి ఒక బలమైన ఆర్థిక వ్యవస్థ, ఒక బలమైన నాయకత్వం సృష్టించినటువంటి పర్యావరణం, ఇంకా ఉదారవాద విధానం.. ఇవే కారణాలు. యావత్తు ప్రపంచం ప్రస్తుతం భారతదేశం పై దృష్టి ని సారిస్తోంది. భారతదేశం త్వరలోనే ప్రపంచం లో అతి పెద్ద ఆర్థిక శక్తుల లో ఒకటి కాగలుగుతుంది. ఇదివరకు మన విశిష్ట దేశం లో పెట్టుబడి పెట్టాలంటే దాదాపు 25-30 మిలియన్ ప్రవాసీ భారతీయులకు అనేకమైనటువంటి ఆంక్షలు ఉండేవి. కానీ ఇప్పుడు ఎంతో ఉదారమైన విధానం వచ్చింది. మరి ఎన్ఆర్ఐ పెట్టుబడి ని దేశీయ పెట్టుబడి గా పరిగణించడం జరుగుతోంది; ఎఫ్‌డిఐ మెరుగైంది. ప్రస్తుతం విదేశీ పెట్టుబడి తో జాయింటు వెంచర్ లను ఏర్పాటు చేయవచ్చు. ఎన్ఆర్ఐ పెట్టుబడులు భారతదేశం లోకి వస్తున్నాయి. ఇది మన ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ ర్యాంకింగ్ లలో వృద్ధి కి ఒక ముఖ్య పరిణామం. ’’