శ్రీ రాకేశ్ భార‌తీ మిత్త‌ల్ , సిఐఐ ప్రెసిడెంటు
‘‘ గ‌డ‌చిన నాలుగు సంవ‌త్స‌రాల లో వ్యాపారానికి సంబంధించిన ప్ర‌తి అంశాన్ని ఒక ఉద్య‌మం త‌ర‌హా లో చేప‌ట్టినందుకు గాను ప్ర‌ధాన మంత్రి శ్రీ మోదీ ని నేను అభినందించదల‌చాను.  ఇది గొప్ప ఫ‌లితాల‌ను అందించింది.  ప్ర‌ధాన మంత్రి శ్రీ మోదీ త‌న ప‌ట్ల సంశ‌యాల‌ను వెలిబుచ్చిన‌ వారి మాటలు త‌ప్ప‌ు అని నిరూపించారు.  ఆయ‌న మొద‌ట్లో సాధించ‌డానికి క‌ష్టంగా తోచినప్పటికీ ఆ త‌రువాత అందుకోలేనివి కాన‌టువంటి ల‌క్ష్యాల‌ను త‌న జ‌ట్టు కు ఇచ్చే ఒక కార్పొరేట్ ప్ర‌ముఖుని లాగా ప‌ని చేస్తారు.  ఈ ప‌ద్ధ‌తి లో సిద్ధించే ఫలితం ఎలా ఉంటుంది అంటే అది ప్ర‌తి ఒక్క‌రూ స‌మ‌ష్టి గా ప‌ని చేసి, మార్గం లో ఎదుర‌య్యే అవ‌రోధాల‌ను తొల‌గించేట‌ట్లు చేస్తుంది.  ఉదాహ‌ర‌ణ‌కు మన‌ం జిఎస్‌టి అమ‌లు లో స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొన్న‌ప్పుడు ప‌రిశ్ర‌మ యొక్క ఇబ్బందుల‌ను ఆర్థిక మండ‌లి మ‌రియు ప్ర‌భుత్వం వెనువెంట‌నే తీర్చి వేశాయి; ఈ సంస్క‌ర‌ణల కార‌ణం గా భార‌త‌దేశ ప‌రిశ్ర‌మ రంగం సంతోషించ‌డ‌మే కాకుండా ఈ మౌలిక మార్పుల‌ను ప్ర‌పంచ ప‌రిశ్ర‌మ సహితం గ‌మ‌నిస్తోంది.  అంతేకాదు, భార‌త‌దేశ విప‌ణి ఇవ్వ‌జూపే అవ‌కాశాల‌ను వినియోగించుకొని ప్రపంచ పరిశ్రమ పెట్టుబడి ని కూడా పెడుతుంది. ’’