శ్రీ సిద్ధార్థ్ జరాబి, బిజినెస్ టెలివిజ‌న్ ఇండియా సంపాద‌కుడు
‘‘వ్యాపారం చేయ‌డం లో సౌల‌భ్యానికి’ సంబంధించి నిర్ణ‌యాలు తీసుకోవ‌డం లో ఇదివ‌ర‌కు ఎరుగ‌నంత శ్ర‌ద్ధ‌ ను నేను గ‌మ‌నించాను. ఈ స్థాయి లో ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ ర్యాంకింగ్ ల‌ను మెరుగు ప‌ర‌చ‌డం ప‌ట్ల శ్ర‌ద్ధ వ‌హించిన మ‌రొక ప్ర‌ధాని అంటూ ఎవ‌రైనా ఉన్నార‌ని నేను అనుకోను.  ఆయ‌న తాను అనుకొన్నది స్ప‌ష్టం గా చెబుతారు.  అంతేగాక‌, దానిని ఎవ‌రి ప‌ట్లా ఎటువంటి ప‌క్ష‌పాతం అనేది లేకుండా ఒక పార‌ద‌ర్శ‌క‌మైన ప‌ద్ధ‌తి లో చేసివేస్తారు.  నేను దీనిని గుజ‌రాత్ లో గ‌మ‌నించాను.  మ‌రి ఢిల్లీ లో కూడాను ప్ర‌తి ఒక్క‌రికీ అన్ని విధానాలు స‌మాన‌మే అనే సంగ‌తి ని నేను పూర్తి విశ్వాసం తో చెప్తున్నాను. ’’