శ్రీ సిరిల్ రామఫోసా, ద‌క్షిణ ఆఫ్రికా అధ్య‌క్షులు
నిర్ణ‌యాత్మ‌కమైన విజ‌యాన్ని అందుకొన్న బిజెపి కి మ‌రియు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ కి ద‌క్షిణ ఆఫ్రికా హృద‌య‌ పూర్వ‌క అభినంద‌న‌లు అందిస్తోంది. మీరు మ‌రొక్క‌ మారు అధికారం లోకి వ‌చ్చిన నేపథ్యం లో మీ యొక్క ప్ర‌తి ప‌ని లోను శుభం జ‌ర‌గాల‌ని మేము ఆకాంక్షిస్తున్నాము. మరి మ‌న రెండు దేశాల మ‌ధ్య స‌త్సంబంధాలు మ‌రింత బలవత్తరం కావడం కోసం మేము ఎదురుచూస్తున్నాము.