“సమగ్ర అభివృద్ధి కి సంబంధించి గుజరాత్ అనుసరిస్తున్న నమూనా ను దేశం లోని పలు రాష్ట్రాలు ఆదర్శం గా తీసుకున్నాయి. గుజరాత్ నమూనా రూపొందడం లో ఈ సదస్సు కూడా తనదైన పాత్ర ను పోషించింది. ఆదర్శ నమూనా కు కారణమైంది. గత నాలుగున్నర సంవత్సరాల్లో గౌరవనీయులైన ప్రధాన మంత్రి దేశాని కి కావలసిన సమగ్రమైన నాయకత్వాన్ని అందించారు. ఆర్ధిక సంస్కరణల్లో కావచ్చు, సామాజిక సంస్కరణల్లో కావచ్చు, పారిస్ లో జరిగిన సిఒపి- 21 ఒప్పందాని కి సంబంధించి పర్యావరణ రంగ నాయకత్వ పటిమ ను కనబర్చడం లో కావచ్చు, లేదా అంతర్జాతీయం గా భారతదేశం అత్యంత బలమైన, ప్రభావవంతమైన దేశం గా ఎదగడం లో కావచ్చు.. ఆయన నాయకత్వం గొప్ప గా ఉంది. దార్శనికత కలిగిన ప్రధాన మంత్రి నాయకత్వం లో ప్రభుత్వ పరం గా అనేక అసాధారణమైన కార్యక్రమాలు జరిగాయి”