“ కేవలం నాలుగు సంవత్సరాల లో భారతదేశం 142 వ స్థానం నుండి 77వ స్థానానికి ఎగబాకడాన్ని చూడడం అమిత ఉత్తేజకరం గా ఉంది. నేను అనుకొంటున్నాను ఇది కేవలం ఆరంభమే అని. భారతదేశం అగ్రగామి 25 స్థానాల లోకి చేరడాన్ని నేను ఇష్టపడుతాను. అనేక దేశాలు పెట్టుబడి పెట్టాలని చూసేటటువంటి ఒక పాశ్చాత్య డిజిటల్ కార్పొరేట్ నుండి ఈ ఖ్యాతి దక్కడమనేది చాలా ఆసక్తిదాయకం గా ఉంది. ఇది భారతదేశాన్ని ఒక విపణి గా, పెట్టుబడి పెట్టడానికి ఒక గమ్య స్థానం గా మార్చి వేసింది. మనకు ఒక ఆకర్షక ప్రధాన మంత్రి ఉన్నారు. శ్రీ మోదీ ప్రపంచం లో ఉత్తమమైన నేతలలో ఒకరుగా ఉన్నారు. ”