సుద‌ర్శ‌న్ ప‌ట్నాయ‌క్‌, అంత‌ర్జాతీయ సైత‌క శిల్పి
“ ప్ర‌ధాన మంత్రిగా న‌రేంద్ర మోదీ తాను ప‌ర్య‌టిస్తున్న ఏ దేశంలోనైనా స‌రే భార‌తీయ సంస్కృతి యొక్క సుసంప‌న్న‌త‌ను ప్ర‌ముఖంగా చాటి చెబుతున్నారు.  సాంస్కృతికంగా స‌మృద్ధ‌మైన మ‌రియు భ‌గ‌వాన్ జ‌గ‌న్నాథుని పురీ థామానికి నెల‌వైన‌టువంటి ఒడిశా నుండి వ‌చ్చిన ఒక క‌ళాకారుడిగా నేను- దేశ‌వ్యాప్తంగా ఉన్న ప్ర‌తిభావంతులైన క‌ళాకారుల‌కు ఒక స్ఫూర్తిని అందజేయడాన్ని మ‌న ప్ర‌ధాన మంత్రి కొనసాగిస్తారని- న‌మ్ముతున్నాను.  ఆయ‌న తీసుకువ‌చ్చిన ‘స్వ‌చ్ఛ‌ భార‌త్’, ‘బేటీ బ‌చావో.. బేటీ ప‌ఢావో’ ల వంటి వినూత్న‌మైన మ‌రియు ప్ర‌యోజ‌న‌కారి కార్య‌క్ర‌మాలు సామాన్య మాన‌వుల మ‌న‌స్సుల‌ను తాకాయి.  వాటిని గురించి అనేక సంద‌ర్భాల‌లో నా ఇసుక బొమ్మ‌ల‌తో ప్ర‌చారం చేసే అదృష్టానికి నేను నోచుకున్నాను. ”