“ 2016 ఏప్రిల్ లో జరిగిన ప్రతిష్ఠాత్మకమైన మాస్కో శాండ్ చాంపియన్ షిప్ లో నేను స్వర్ణ పతకాన్ని గెలుచుకొన్న తరువాత మాన్య ప్రధాన మంత్రి మోదీ గారిని కలుసుకోవడంతో నేను కన్న కల నెరవేరినట్లు అయింది. ఆయన నన్ను ప్రోత్సహిస్తూ, దయతో పలికిన పలుకులు ఇప్పటికీ నా చెవులలో మారుమోగుతున్నాయి. అంతేకాకుండా, నా పనిని కొనసాగించడంలో దారిని చూపే ద్వీపంలా ఆయన చెప్పిన మాటలు నాలో ప్రేరేపణను కలిగిస్తూనే ఉన్నాయి. ఆయన సమక్షంలో నేను నిజమైన ప్రోత్సాహాన్ని, ఉత్తేజాన్ని అనుభూతి చెందుతున్నాను. ”