స‌చిన్ టెండూల్కర్
‘‘ దేశంలో క్రీడ‌ల‌కు, క్రీడాకారుల‌కు ఆయ‌న (శ్రీ‌ న‌రేంద్ర మోదీ) అందించే ప్రోత్సాహం అసాధార‌ణం.  రియో ఒలంపిక్స్ లో ప్ర‌తిభాపాట‌వాలు ప్ర‌ద‌ర్శించేందుకు వెళ్తున్న క్రీడాకారుల‌కు ఆయ‌న ఎంతో చిత్త‌శుద్ధితో ఇచ్చిన మ‌ద్ద‌తును, ప్రోత్సాహాన్ని నేనెప్పుడూ ఎంతో ఇష్టంగా గుర్తు చేసుకుంటాను.  దేశ యువ‌త అభివృద్ధిలోను, మ‌నం ఎదుర్కొంటున్న జీవ‌న‌ శైలికి సంబంధించిన వ్యాధుల‌కు స‌హ‌జ‌ సిద్ధ‌మైన చికిత్స అందించ‌డం లోనూ క్రీడ‌లు కీల‌క పాత్ర పోషిస్తాయ‌ని ఆయ‌న ఎపుడూ చెబుతూ ఉంటారు. ’’