దేశ పన్నుల రంగంలో వస్తుసేవల పన్ను అతిపెద్ద సంస్కరణ. వివిధ రకాల వస్తుసేవలపై రకరకాల బహుళ అంచెల పరోక్ష పన్నుల మోతబరువును తొలగిస్తుందన్న ఆశాభావం కనిపిస్తోంది. కేంద్ర, రాష్ట్రాల స్థాయిలో అనేక పన్నులు, రుసుములన్నీ ఇందులో విలీనమైపోతాయి. అంటే దేశం మొత్తం జాతీయ విపణిగా మారిపోతుందన్న మాట. అత్యంత ఆపేక్షణీయమైన పారదర్శకతను జీఎస్టీ సాకారం చేస్తుంది. రాబోయే సంవత్సరాల్లో మరింత ఎక్కువ పెట్టుబడులు వస్తాయి. పెరిగే పన్ను వసూళ్లు, పెట్టుబడులద్వారా భారత స్థూల దేశీయోత్పత్తికి అదనపు పాయింట్లు జోడవుతాయని ఆశిస్తున్నాం.