క్రిస్టఫర్ ఎలియాస్, ప్రెసిడెంటు, గ్లోబల్ డివెలప్ మెంట్ డివిజన్, బిల్ ఎండ్ మిలిండా గేట్స్ ఫౌండేశన్
‘‘తలసరి ప్రాతిపదికన చూసినప్పుడు భారీ సంఖ్య లో  ఎఎస్ హెచ్ ఎ లు (అక్రెడిటెడ్ సోషల్ హెల్త్ ఏక్టివిస్టు లు.. ‘ఆశా’ లు), ఆంగన్ వాడీ వర్కర్లు మరియు ఎఎన్ఎమ్ ల(ఆక్సిలరీ నర్స్ మిడ్ వైవ్స్)తో కూడినటువంటి ఆరోగ్య కార్యకర్తల దళాన్ని నిర్మించడం ద్వారా అటు ఆర్థిక పరిరక్షణ ను కల్పించడం తో పాటు ఇటు ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ ను పటిష్ఠపరచే ఆయుష్మాన్ భారత్ విషయం లో నేను ఉత్తేజితుడిగా ఉన్నాను.  ఇది ఆరంభ దశ లో ఉంది; అంతే కాదు తొలి 100 రోజుల లోనే శరవేగంగా విస్తరించి పలువురికి చేరువగా వెళ్లడంతో పాటు మరింత మంది ని సమీపించాలన్న మహత్త్వాకాంక్ష కూడా ఈ పథకాని కి ఉంది.’’