స్టార్టప్ ఇండియా విశేష ప్రేరణనిచ్చే కార్యక్రమం. భారత అంకుర సంస్థల పర్యావరణ వ్యవస్థ శక్తిని ఇది ముందుకు తెచ్చింది. ప్రత్యేకించి మన దేశం ఎదుర్కొంటున్నసమస్యల పరిష్కారం దిశగా వినూత్న ఆవిష్కరణలలో భారతీయులకుగల సామర్థ్యాన్నిఇది ప్రస్ఫుటం చేసింది. దీనికి అనుగుణంగా పర్యావరణ వ్యవస్థ ఎదుగుదల, సాధికారతకు ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉండటం ఉత్సాహాన్నిస్తోంది. ప్రధాని నిర్దేశించిన పథకాల వేగం పెంచడం మన ముందున్న తక్షణావసరం. ఈ నేపథ్యంలో ఇవాళ్టి ఈ కార్యక్రమం పరుగుకు సిద్ధంగా ఉన్నవేలాదిమంది తమదైన ప్రతిభను చూపగలిగేలా మరింత ధైర్యాన్నిస్తుందన్న విశ్వాసం నాకుంది.