భారతదేశంలో కార్యకలాపాలు నిర్వహించడంలో బహుళ జాతి కంపెనీలను ఆకట్టుకుంటున్న కార్యక్రమం మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం. ప్రధాన మంత్రి శ్రీ మోదీని గురించి నేను చాలా గొప్పగా అనుకుంటున్నాను. నేను కాదు, అందరూ కూడా. స్వచ్ఛమైన గాలిని పీల్చుకుంటే ఎలా ఉంటుందో అలా వుంది శ్రీ మోదీ వ్యవహార శైలి. బహుళ జాతి కంపెనీలను ఆహ్వానించడంతో పాటు ఆయన మరికొంత చేయాలి. సరైన వాతావరణం ఉంటుందనే భరోసాను ఇవ్వాలి. ఆయన తనకు పేరు ప్రఖ్యాతులు రావడానికి పని చేస్తున్నారనే అపోహ ఉంది. కానీ నేను అలా అనుకోవడం లేదు. ఆయన పని విధానం, విలువలు ఆయన వ్యవహారశైలికి అద్దంపడుతున్నాయి.