ప్రధానమంత్రి స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం ఎంతో సమగ్రంగా జీవితంలోని ప్రతి అంశాన్నీ స్పృశిస్తూ తన నాయకత్వంలో సాధించిన నిర్దిష్ట విజయాలను సాకల్యంగా వివరిస్తూ సాగింది. భారత్‌కు సిద్ధించాల్సిన అత్యంత ఉజ్వల భవిష్యత్తు దిశగా ప్రధాని మేల్కొలుపు పలికారు. తపాలా చెల్లింపుల బ్యాంకు గురించి, ఇటీవలిదాకా నేను మంత్రిగా పనిచేసిన బీఎస్ఎన్ఎల్ కొత్త మలుపును గురించి ప్రధానమంత్రి వివరించిన తీరు నన్నెంతగానో ఆకట్టుకుంది. విస్తరిస్తున్న ఆధార్ పాత్రను, గడచిన రెండేళ్లలో భారత్‌లో ఏర్పాటైన మొబైల్ ఫోన్ల పరిశ్రమలను ప్రధానమంత్రి ప్రస్తావించినప్పుడు ఉత్సాహం ఉప్పొంగింది.