సిలికాన్ వ్యాలీలో ప్రధానమంత్రి మోదీ అక్టోబరులో చేసిన ప్రసంగం విన్నప్పుడు అందులోని భావావేశం, దార్శనికత, అపార ప్రగతికిగల అవకాశాలు నాకు అవగతమై నేనెంతో ముగ్దురాలినయ్యాను. సాంకేతిక పరిజ్ఞానం భారతదేశాన్నేగాక మొత్తం ప్రపంచాన్ని మరింత సంపన్నం చేయగలదన్న వాస్తవం కూడా నాకు అర్థమైంది. ప్రధాన మంత్రిని చూడటానికి, ఆయనతో మాట్లాడటానికే కాకుండా ఆ పరిసర వ్యవస్థతో మమేకం కావడానికి కూడా భాతరదేశం రావాలని నాకు తెలుసు. ఎంతో లోతైన, విస్తృత దార్శనికతతోపాటు విద్యావంతులతో కూడిన శక్తిమంతమైన మేధో పునాదిని మరెక్కడా చూడలేం మరి!