ప్రధానమంత్రి మోదీ నాయకత్వాన ఆర్థిక వ్యవస్థ పూర్తి వేగాన్ని అందుకోవటానికి సిద్ధమైన పులిగా పరిగణించబడుతోంది. 2 లక్షల కోట్ల డాలర్ల ఈ ఆర్థిక వ్యవస్థను ప్రపంచం నిశితంగా పరిశీలిస్తోంది. ప్రధానమంత్రి కూడా ఐటీ రంగానికి ఉత్తేజమిచ్చే అనేక విధానాలు, ప్రక్రియలకు శ్రీకారం చుట్టారు. పట్టణ-గ్రామీణ అగాధానికి వారధి నిర్మించడంలో సాంకేతిక పరిజ్ఞానం ప్రాముఖ్యాన్నిఎర్రకోటపై నుంచి చేసిన తన తొలి ప్రసంగంలోనే నొక్కిచెప్పారు. దేశవ్యాప్తంగా 6 లక్షల కోట్ల కిలోమీటర్ల మేర "బ్రాడ్‌బ్యాండ్ రహదారుల" సృష్టి, అనుసంధానతల ఆవశ్యకతను చక్కగా వివరించారు. ప్రతి పౌరుడికీ డిజటల్ మౌలిక సదుపాయం అందుబాటులోకి రావాలన్నది మోదీ మానస పుత్రికవంటి పథకాల్లో ఒకటైన డిజిటల్ ఇండియా లక్ష్యం. దీంతోపాటు అన్ని గ్రామ పంచాయతీలకూ వేగవంతమైన ఇంటర్నెట్ సదుపాయం కీలకం కావాలనీ లక్షిస్తోంది. అలాగే స్టార్టప్ ఇండియా మరో ప్రతిష్ఠాత్మక ప్రభుత్వ పథకం. దేశంలో అంకుర సంస్థలకు బలమైన పర్యావరణ సృష్టి దీని ప్రధానోద్దేశం. స్టార్టప్ ఇండియా-స్టాండప్ ఇండియా నినాదంతో ప్రధాని మోదీ ఈ కార్యక్రమంలో పత్యక్ష పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థతోపాటు పర్యావరణంపైనా సానుకూల ప్రభావం ఉంటుందని మనం ఆశించవచ్చు.