పిఎంఇండియా
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వారణాసి పార్లమెంటరీ నియోజకవర్గం నుండి వచ్చిన గ్రామ ప్రధాన్ లను ఈ రోజు న్యూ ఢిల్లీ లోని తన నివాసంలో సత్కరించారు. ప్రధాన మంత్రి తో భేటీ అయిన ఇటువంటి బృందాలలో ఈ బృందం నాలుగోది.
బృందం సభ్యులతో ముచ్చటించిన ప్రధాన మంత్రి పాఠశాలలకు చిన్నారులు క్రమం తప్పక హాజరు అయ్యేటట్లుగాను, అలాగే పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం నాణ్యమైందిగా ఉండేటట్లు గాను చూడవలసిందంటూ వారిని ఉత్సాహపరిచారు. వారి వారి గ్రామాలలో స్వచ్ఛతను పరిరక్షించవలసిందిగా కూడా ఆయన వారికి సూచించారు.
అబ్బాయిలకు, అమ్మాయిలకు మధ్య ఎటువంటి వివక్షనైనా సరే తొలగించాలని ఆయన ఈ సందర్భంలో స్పష్టంచేశారు.