Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఎ పి టి ఎ నాలుగో విడత సంప్రతింపులలో టారిఫ్ రాయితీల మార్పిడికి మంత్రివర్గ ఆమోదం


ఏషియా పసిఫిక్ ట్రేడ్ అగ్రిమెంట్ (ఎ పి టి ఎ) మరియు సంబంధిత సవరణల లో భాగంగా జరిగిన నాలుగో విడత సంప్రతింపులలో భాగంగా మార్జిన్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఆధారంగా టారిఫ్ రాయితీల మారకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కేంద్ర మంత్రివ‌ర్గ స‌మావేశానికి అధ్య‌క్ష‌త వ‌హించారు. ఏషియా పసిఫిక్ ప్రాంతంలో అభివృద్ధి చెందుతున్న సభ్యత్వ దేశాల మధ్య టారిఫ్ రాయితీల మారకం ద్వారా వాణిజ్య విస్తరణ లక్ష్యంగా ఏషియా మరియు పసిఫిక్ కోసం ఐక్య రాజ్య సమితి ఆర్థిక మరియు సామాజిక కమిషన్ (యు ఎన్ ఇ ఎస్ సి ఎ పి) ఆధ్వర్యంలో జరిగిన ప్రయత్న ఫలితమే ఏషియా పసిఫిక్ వాణిజ్య ఒప్పందం (ఎ పి టి ఎ- గతంలో బ్యాంకాక్ ఒప్పందం). ప్రస్తుతం ఎ పి టి ఎ లో ఆరు దేశాలు లేదా పాల్గొనే రాజ్యాలు (participating states- PSs) ఉన్నాయి. అవి : బంగ్లాదేశ్, చైనా, భారతదేశం, లావో పి డి ఆర్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా మరియు శ్రీ లంక.

ఇది ప్రిఫరెన్షియల్ వాణిజ్య ఒప్పందం కావడం వల్ల, ఎప్పటికప్పుడు జరిగే వాణిజ్య సంప్రతింపులలో వాణిజ్య వస్తువుల సంఖ్య, టారిఫ్ రాయితీల పరిధి పెరుగుతూ ఉంటాయి. ఇప్పటి వరకు మూడు విడతల వాణిజ్య సంప్రతింపులు జరిగాయి. 3వ దఫా దాకా, భారత దేశం 23.9 % మార్జిన్ ఆఫ్ ప్రిఫరెన్స్ (MoP) సగటుతో 570 టారిఫ్ లైన్‌ల మీద టారిఫ్ ప్రిఫరెన్స్‌లను అందించింది. అదనంగా 6 అంకెల ఎచ్ ఎస్ స్థాయితో (HS-Harmonized System-World Customs Organisation వస్తువులకు ఇచ్చే కోడింగ్) 39.7% MoP సగటుతో ఎల్ డి సి ( లీస్ట్ డెవలప్ డ్ కంట్రీస్) దేశాలకు 48 లైన్‌లను అందించింది. మూడవ దఫా సంప్రతింపులు అన్ని పాల్గొనే రాజ్యాలతో కలిపి, 27.2% MoP సగటుతో మొత్తంగా 4,270 వస్తువుల మీద రాయితీలు ప్రకటించాయి.

33.45% MoP సగటుతో, భారతదేశం అందించదలచుకొన్న సుంకం చెల్లించే జాతీయ టారిఫ్ లైన్‌లలో(8 అంకెల HS2012లో 3142 లైన్లు) 28.01% కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఎ పి టి ఎ పాల్గొనే ఏడో రాజ్యంగా మంగోలియాను చేర్చుకోవడానికి అనువుగా ఎ పి టి ఎ పీఠికలో సవరణకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సెక్టొరల్ రూల్ ఆఫ్ ఆరిజిన్ ( అంతర్జాతీయ వాణిజ్యంలో ఒక వస్తువు మూల దేశాన్ని నిర్ణయించే సూత్రం) ఒప్పందంలో చేర్చేందుకు అవసరమైన సవరణలను కూడా మంత్రివర్గం ఆమోదించింది.

త్వరలో జరగబోయే ఎ పి టి ఎ మంత్రివర్గ కౌన్సిల్ నాలుగో సభ పైన ప్రస్తావించిన నిర్ణయాలను లాంఛనంగా అమలుపరుస్తుంది.