Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్యారిస్ ఒప్పందపు అంగీకారాన్ని ఆమోదించిన కేంద్ర ప్రభుత్వం


2 అక్టోబర్ 2016, గాంధీ జయంతి రోజున ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ప్యారిస్ ఒప్పందపు (వాతావరణ మార్పు)అంగీకారానికి తన ఆమోదాన్ని తెలిపింది.

గత సంవత్సరం 12 డిసెంబర్ 2015 న 185 దేశాలు కలసి ప్యారిస్ ఒప్పందాన్ని కుదుర్చుకొన్నాయి.భారతదేశం ఈ సంవత్సరం మొదట్లో 22 ఏఫ్రిల్ 2016 న న్యూయార్క్‌లో ప్యారిస్ ఒప్పందం మీద సంతకం చేసింది. ఇప్పటిదాకా మొత్తం 191 దేశాలు ప్యారిస్ ఒప్పందం మీద సంతకం చేసాయి. ప్యారిస్ ఒప్పందం నిబంధనల ప్రకారం, ప్రపంచ ఉద్గారంలో 55% వాటా వున్న 55 దేశాలు ఈ ఒప్పందాన్ని అంగీకరించినప్పుడు ఈ ఒడంబడిక అమలులోకి వస్తుంది. ఇప్పటి దాకా, గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలలో 47.79% వాటా వున్న 67 దేశాలు తమ అంగీకారాన్ని తెలిపాయి.

ఈ ఒప్పందాన్ని అంగీకరించాలని తీసుకొన్న భారతదేశ నిర్ణయంతో, ఒప్పందాన్ని అంగీకరించిన సంచిత స్థాయి ఉద్గారలున్న దేశాల శాతం 51.89% కి చేరింది. అన్నివైపుల నుంచి వస్తున్న స్పందన, ఈ సంవత్సరాంతంలోగా ఒప్పందాన్ని అంగీకరించేందుకు అనేక దేశాలు సుముఖంగా వుండటంతో, ఈ ఒప్పందం త్వరలోనే అమలులోకి వస్తుందనీ, వాతావరణ మార్పు అంశం మీద ప్రపంచ వ్యాప్తంగా తీసుకుంటున్న చర్యలకు వూతం లభిస్తుందని నమ్ముతున్నారు.

ఈ ఒప్పందాన్ని అంగీకరించాలని తీసుకున్న నిర్ణయంతో, భారతదేశం ప్యారిస్ ఒప్పందాన్ని అమలులోకి తీసుకు రావడానికి కృషి చేసిన కీలక దేశాలలో ఒకటిగా నిలుస్తుంది. ప్యారిస్ ఒప్పందానికి సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా ఏకాభిప్రాయాన్ని తీసుకొని రావడంలో భారతదేశపు పాత్రను దృష్టిలో పెట్టుకుంటే, ఇవాళ తీసుకున్న నిర్ణయం పర్యావరణ సంరక్షణ, వాతావరణ శాంతి కి సంబంధించి అంతర్జాతీయ లక్ష్యానికి కట్టుబడి వున్న దేశాల కూటమికి భారతదేశపు నాయకత్వాన్ని మరింత నొక్కి చెబుతుంది.

ప్యారిస్ ఒప్పందాన్ని అంగీకరించేందుకు ఒప్పుకొంటూ, భారతదేశం తన జాతీయ చట్టాల్నీ, దాని అభివృద్ధి అజెండానీ, అమలుకు అవసరం అయ్యే సాధనాల లభ్యత, వాతావరణ మార్పుకు సంబంధించి ప్రపంచ దేశాల నిబద్ధత గురించి తన అంచనా, వూహించగల, పొందగల మరింత శుద్ధమైన ఇంధన వనరుల అందుబాటు-వీటిని ఒప్పొందాన్ని అంగీకరించేందుకు సందర్భంగా ప్రకటించాలని కూడా కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది.

ప్యారిస్ ఒప్పందం 2020 తర్వాతి వాతావరణ మార్పుకు సంబంధించినది. 2020 కు ముందు కాలంలో, అభివృద్ధి చెందిన దేశాలు క్యోటో ఒప్పొందం ప్రకారం చర్యలు చేపట్టాలి. కొన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలు స్వఛ్చందంగా ప్రతిన పూనాయి.