పిఎంఇండియా
శ్రేష్ఠుడైన అధ్యక్షుడు శ్రీ శీ జిన్‌పింగ్, శ్రేష్ఠుడైన అధ్యక్షుడు శ్రీ జేకబ్ జూమా, శ్రేష్ఠుడైన అధ్యక్షుడు శ్రీ మిషెల్ టెమెర్ , శ్రేష్ఠుడైన అధ్యక్షుడు శ్రీ వ్లాదిమీర్ పుతిన్, బ్రిక్స్ బిజినెస్ కౌన్సిల్ ప్రముఖ సభ్యులారా.. బ్రిక్స్ బిజినెస్ కౌన్సిల్ సమావేశానికి మీకు సాదర స్వాగతం పలకడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ బిజినెస్ కౌన్సిల్ పూర్తిస్థాయి ఆర్థిక బహుళత్వానికి, మన దేశాల మధ్య గల వ్యాపార కార్యకలాపాల స్థాయికి అద్దం పడుతోంది. బాధ్యతాయుత, సమష్ఠి పరిష్కారాల ద్వారా సమ్మిళిత ఆర్థిక వ్యవస్థలను నిర్మించాలన్న బ్రిక్స్ కార్యక్రమాల పట్టికకు అనుగుణంగా తమ వంతు కృషి చేస్తున్న వారందరికీ నా కృతజ్ఞతలు. మహోదయులారా మరియు మిత్రులారా, ఆర్థిక, వాణిజ్య కార్యకలాపాలను ప్రోత్సహించడం బ్రిక్స్ ఏర్పాటుకు మౌలిక ప్రేరణ. బ్రిక్స్ బిజినెస్ కౌన్సిల్‌ను మనం డర్బన్‌లో ఏర్పాటు చేసిన మూడు సంవత్సరాల తరువాత అది ఒక ఆరోగ్యకరమైన రూపాన్ని సంతరించుకోవడం ఒక ప్రోత్సాహకర పరిణామం. బ్రిక్స్ దేశాల మధ్య వేగవంతమైన, సన్నిహిత వాణిజ్య సహకారానికి బలమైన ప్రోత్సాహకులు మన వ్యాపార సముదాయాలు. వారి భాగస్వామ్యం మన సమాజంలో సంపదను , విలువను సృష్టిస్తుంది. అంతే కాదు, ఉత్పాదకతను పెంపొందిస్తుంది, సాంకేతిక ఆవిష్కరణలు, సామర్థ్యం పెంపు ద్వారా మన ఆర్థిక వ్యవస్థలలో ఉపాధి అవకాశాలు సృష్టింపబడతాయి. ఆ దార్శనికతను నేను అభినందిస్తాను. నా ఆలోచన కూడా అదే. మహోదయులారా, భారతదేశంలో మేము పరిపాలనను సరైన పద్దతిలో పెట్టేందుకు, సులభతరం చేసేందుకు ప్రత్యేకించి భారత దేశంలో వ్యాపారం చేసేందుకు సంబంధించి గత రెండు సంవత్సరాలలో చెప్పుకోదగిన సంస్కరణలు తీసుకువచ్చాము. దీని ఫలితాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ రంగంలో పనితీరును అంచనా వేసే దాదాపు అన్నిరకాల సూచికలలో మేం ఉన్నత స్థాయిని సాధించాము. మేము భారత దేశాన్ని ఇవాళ ప్రపంచంలోని మరింత బాహాట ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా రూపుదిద్దుకొనేటట్లు చేశాము. మా అభివృద్ధి బలంగా ఉంది. ఈ వేగం మరింత పెరిగేందుకు మేము చర్యలు తీసుకుంటున్నాము. బ్రిక్స్ బిజినెస్ కౌన్సిల్ కూడా మౌలిక సదుపాయాల అభివృద్ధి, తయారీ రంగ సరఫరా వ్యవస్థల ఏర్పాటు, నైపుణ్యాభివృద్ధిని పెంపొందించడం, వాణిజ్య అడ్డంకులను తొలగించడం, వ్యాపార కార్యకలాపాలను సులభతరం చేయడం వంటి అంశాలలో ప్రాధాన్యం కలిగిఉండడం నాకు సంతోషం కలిగిస్తోంది. బ్రిక్స్ దేశాల మధ్య వాణిజ్యం, వ్యాపార విస్తరణకు బ్రిక్స్ బిజినెస్ కౌన్సిల్ కార్యకలాపాలు ఎంతగానో ఉపకరించనున్నాయి. మహోదయులారా, కొత్త అభివృద్ధి బ్యాంకు ప్రస్తుతం పూర్తి స్థాయిలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. మనందరి సమష్ఠి కృషికి పటుతరమైన ఫలితమే దీని విజయం. తొలి దశ ప్రాజెక్టులను చేపడుతున్నందుకు ఎన్‌డిబి కి, దాని యాజమాన్యానికి మా అభినందనలు. పరిశుభ్రమైన ఇంధనం, హరిత, సుస్థిర మౌలిక సదుపాయాలను ఎన్‌డిబి తన ప్రాధాన్య అంశాలుగా పెట్టుకుంది. మేము దానిని స్వాగతిస్తున్నాము. ఆర్థిక ప్రాజెక్టుల ఎంపిక, వాటి అమలుకు సంబంధించి బిజినెస్ కౌన్సిల్ ఎన్డిబితో సన్నిహితంగా కలసి పనిచేయడాన్ని మేము ప్రోత్సహిస్తాము. మీ మీ దేశాలు క్రియాశీలంగా పాల్గొనడం వల్ల రెండు రోజుల క్రితం న్యూ ఢిల్లీలో బ్రిక్స్ తొలి ట్రేడ్ ఫెయిర్‌కు ఇండియా ఆతిథ్యం ఇచ్చింది. వ్యాపారానికి సంబంధించి మరింత అవగాహన తీసుకురావడానికి, వాణిజ్యపరంగా మార్పిడికి ఇలాంటి కార్యక్రమాలను తప్పకుండా ప్రోత్సహించవలసి ఉంది. మహోదయులారా, ఈ ఒక్కవిషయాన్ని ప్రస్తావించి నా ప్రసంగాన్ని ముగిస్తాను. ప్రభుత్వాలుగా మనం బ్రిక్స్ బిజినెస్ కౌన్సిల్ మనతో కలసి , మన ఉమ్మడి లక్ష్యాలైన పరస్పర వాణిజ్యాన్ని బలోపేతం చేయడం; వ్యాపార అవకాశాలను విస్తృతం చేయడం; పెట్టుబడి అనుసంధానతలను నిర్మించడం; కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించడం; బ్రిక్స్దేశాల మధ్య వాణిజ్యానికి గల అవరోధాలను తొలగించడం వంటి వాటిని సాధించే దిశగా కృషి చేయాలని కోరుకుంటున్నాం. కొద్దిసేపట్లో బ్రిక్స్ బిజినెస్ కౌన్సిల్, ఎన్‌డిబి నాయకత్వం నుండి మనము దీనిని వినబోతాం. మీ అందరికీ ఇవే నా ధన్యవాదాలు. మరీ మరీ కృతజ్ఞతలు.
Spoke on the rich potential of economic cooperation between BRICS nations at the @BRICS2016 Business Council Meet. https://t.co/3hSDJRDR3p
— Narendra Modi (@narendramodi) October 16, 2016
Highlighted reforms undertaken by India in last 2 years to make business easier & make India one of the most open economies in the world.
— Narendra Modi (@narendramodi) October 16, 2016
BRICS Business Council has a key role in strengthening trade & business opportunities, building investment linkages & promoting innovation.
— Narendra Modi (@narendramodi) October 16, 2016