Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధానమంత్రి ని కలిసిన పర్ప్లెక్సిటీ ఏఐ సీఈఓ


పర్ప్లెక్సిటీ ఏఐ సీఈఓ శ్రీ అరవింద్ శ్రీనివాస్ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని ఆదివారం కలిశారు.

సామాజిక మాధ్యమం ఎక్స్ లో అరవింద్ శ్రీనివాస్ చేసిన ఓ పోస్టుపై స్పందిస్తూ శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:

“మిమ్మల్ని కలిసి కృత్రిమ మేధ, దాని ఉపయోగాలు, దాని పరిణామంపై చర్చించడం చాలా సంతోషాన్నిచ్చింది. @perplexity_aiతో మీరు గొప్ప పని చేస్తుండడం హర్షణీయం. మీ భవిష్యత్తు ప్రయత్నాలు విజయవంతం కావాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతున్నాను.” 

***

MJPS/SR