Search

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

తెలంగాణ లోని సంగారెడ్డిలో ఓ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం…ప్రాణనష్టం సంభవించినందుకు ప్రధానమంత్రి సంతాపం


తెలంగాణలోని సంగారెడ్డిలో ఓ కర్మాగారంలో అగ్ని ప్రమాదం కారణంగా ప్రాణనష్టం వాటిల్లినందుకు ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, గాయపడ్డ వ్యక్తులకు రూ.50,000 చొప్పున ‘ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి’ (పీఎంఎన్ఆర్ఎఫ్) నుంచి నష్టపరిహారాన్ని అందించనున్నట్లు ఆయన ప్రకటించారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి కార్యాలయం ఇలా పేర్కొంది:

“తెలంగాణరాష్ట్రం, సంగారెడ్డిలోగల ఒక కర్మాగారంలో జరిగిన అగ్నిప్రమాదంలో చాలా మంది ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం. తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. మృతుల బంధువులకు PMNRF నుండి రూ. 2 లక్షలు వంతున, క్షతగాత్రులకు రూ. 50,000 చొప్పున ఎక్స్–గ్రేషియా అందిస్తాం: ప్రధాని @narendramodi”

 

***