పిఎంఇండియా
భూకంపాలను ఎదుర్కొనే సన్నద్ధత, తక్షణ ప్రతిస్పందన యంత్రాంగం, సామర్థ్య పెంపులో అనుభవాల మార్పిడికి వీలు కల్పించే భూకంప నష్టాల తగ్గింపు సహకారంపై భారత్, న్యూజిలాండ్ దేశాల సంబంధిత సంస్థల మధ్య అవగాహన ఒప్పందం కోసం జరుగుతున్న కృషిని ఇద్దరు నాయకులు స్వాగతించారు.
విద్య, రాకపోకలు, క్రీడలు, ప్రజల మధ్య సంబంధాలు
భారత్, న్యూజిలాండ్ మధ్య పెరుగుతున్న విద్య, కమ్యూనిటీ సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి గొప్ప అవకాశాలు ఉన్నాయని ఇరువురు ప్రధానులు అంగీకరించారు. సైన్స్, ఆవిష్కరణలు, నూతన, కొత్తగా ఉద్భవిస్తున్న సాంకేతికతలు వంటి రంగాలతో సహా పరస్పర ఆసక్తి ఉన్న రంగాలపై దృష్టి సారించే భవిష్యత్తు ఆధారిత భాగస్వామ్యాలను ఏర్పరచుకోవాలని రెండు దేశాల విద్యా సంస్థలకు సూచించారు.
న్యూజీలాండ్ లో నాణ్యమైన విద్యను అభ్యసించాలనుకునే భారతీయ విద్యార్థులకు మరిన్ని అవకాశాలను సృష్టించాలని నాయకులు కోరారు. సైన్స్, ఆవిష్కరణ, కొత్త, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలతో సహా వివిధ రంగాలలో విస్తృత భాగస్వామ్యానికి మద్దతు ఇవ్వడానికి నైపుణ్య అభివృద్ధి, నైపుణ్యం కలిగిన సిబ్బంది రాకపోకల అవసరాన్ని వారు గుర్తించారు. వాణిజ్య ఒప్పందం చర్చల ప్రారంభానికి అంగీకరించిన నేపథ్యంలో ఇరుదేశాల మధ్య వృత్తినిపుణులు, నైపుణ్యం కలిగిన కార్మికుల తరలింపును సులభతరం చేసే ఏర్పాటుపై కూడా చర్చలు ప్రారంభించాలని, అదే సమయంలో అక్రమ వలసల సమస్యను పరిష్కరించాలని ఇరువురు నేతలు అంగీకరించారు.
భారత విద్యా మంత్రిత్వ శాఖ, న్యూజిలాండ్ విద్యా మంత్రిత్వ శాఖ మధ్య పునరుద్ధరించిన విద్యా సహకార ఒప్పందంపై సంతకం జరగడాన్ని నాయకులు స్వాగతించారు. ద్వైపాక్షిక విద్యా సంబంధాల బలోపేతానికి ప్రాతిపదికగా భారత్, న్యూజిలాండ్ విద్యావిధానాలపై నిరంతర సమాచార మార్పిడికి ఈ ఒప్పందం దోహదపడుతుంది.
భారత్, న్యూజిలాండ్ మధ్య క్రీడల్లో ముఖ్యంగా క్రికెట్, హాకీ, ఇతర ఒలింపిక్ క్రీడల్లో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని నేతలు పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య క్రీడా సంబంధాలు, సహకారాన్ని మరింత పెంపొందించడానికి క్రీడలకు సంబంధించి సహకార ఒప్పందంపై సంతకాలు చేయడాన్ని వారు స్వాగతించారు. భారత్, న్యూజిలాండ్ మధ్య 100 ఏళ్ల క్రీడా సంబంధాలకు గుర్తుగా 2026లో నిర్వహించనున్న ‘స్పోర్టింగ్ యూనిటీ‘ ఈవెంట్లను వారు స్వాగతించారు.
భారత్, న్యూజిలాండ్ లలో సంప్రదాయ వైద్యానికి సంబంధించిన బలమైన వ్యవస్థల ప్రాముఖ్యతను ప్రధానమంత్రులు అంగీకరించారు. అలాగే, సమాచారం, ఉత్తమ పద్ధతుల మార్పిడి, నిపుణుల సందర్శనల ద్వారా సహకారానికి గల అవకాశాలను అర్థం చేసుకోవడానికి, అన్వేషించడానికి రెండు వైపులా సైన్స్, పరిశోధన రంగాల నిపుణుల మధ్య చర్చలను స్వాగతించారు.
యోగా, భారతీయ సంగీతం, నృత్యం పట్ల న్యూజిలాండ్ వాసుల్లో పెరుగుతున్న ఆసక్తిని, అలాగే భారతీయ పండుగలను స్వేచ్ఛగా జరుపుకోవడాన్ని ఇరువురు ప్రధానులు ప్రస్తావించారు. సంగీతం, నృత్యం, నాటకం, సినిమాలు, పండుగల ద్వారా ద్వైపాక్షిక సంబంధాలను మరింత పెంచుకోవాలని ఆకాంక్షించారు.
ప్రాంతీయ,బహుపాక్షిక రంగాలలో సహకారం
సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతను గౌరవించే బహిరంగ, సమ్మిళిత, స్థిరమైన, సంపన్నమైన ఇండో–పసిఫిక్ కు మద్దతు ఇవ్వడానికి తమ నిబద్ధతను ఇరువురు ప్రధానులు పునరుద్ఘాటించారు.
తూర్పు ఆసియా శిఖరాగ్ర సదస్సు, ఆసియాన్ రక్షణ మంత్రుల సమావేశం ప్లస్, ఆసియాన్ ప్రాంతీయ ఫోరం వంటి ఆసియాన్ ఆధ్వర్యంలోని వివిధ ప్రాంతీయ వేదికల్లో భారత్, న్యూజిలాండ్ ల మధ్య కొనసాగుతున్న సహకారాన్ని నేతలు ప్రస్తావించారు. ఇండో–పసిఫిక్ ప్రాంతం భద్రతను, శ్రేయస్సును మరింత పెంపొందించడానికి ఈ ప్రాంతీయ సంస్థల ప్రాముఖ్యతను, ఆసియాన్ కేంద్ర భూమికను నాయకులు పునరుద్ఘాటించారు. ఈ ప్రాంతంలో శాంతి, సుస్థిరతను కాపాడుకోవడం అన్ని పక్షాల బాధ్యత అని స్పష్టం చేశారు. సమకాలీన వాస్తవాలను ప్రతిబింబించే విధంగా ఐక్యరాజ్యసమితి కేంద్రబిందువుగా సమర్థవంతమైన బహుపాక్షిక వ్యవస్థ అవసరాన్ని ఇరువురు నాయకులు స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సవాళ్లను ఎదుర్కొనేందుకు ఇది కీలకమైన అంశమని వారు చెప్పారు. భద్రతా మండలిని మరింత ప్రాతినిధ్యంతో విశ్వసనీయంగా, సమర్థవంతంగా మార్చేందుకు దాని సభ్యత్వాన్ని విస్తరించడం సహా ఐక్యరాజ్యసమితి సంస్కరణల అవసరాన్ని ఇరు పక్షాలు ఉద్ఘాటించాయి. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్ అభ్యర్థిత్వాన్ని న్యూజిలాండ్ సమర్థించింది. బహుళపక్ష కూటమిలో ఒకరి అభ్యర్థిత్వానికి ఒకరు పరస్పరం మద్దతు ఇచ్చే అవకాశాలను పరిశీలించాలని ఇరు పక్షాలు అంగీకరించాయి.
ప్రపంచవ్యాప్తంగా అణ్వాయుధ నిరాయుధీకరణ, అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక విధానానికి కట్టుబడి ఉండవలసిన అవసరాన్ని ఇరువురు నాయకులు అంగీకరించారు. పరిశుభ్ర ఇంధన లక్ష్యాలు, అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక నిబద్ధతకు అనుగుణంగా భారత్ అణు సరఫరా దేశాలతో చేరడం ప్రాముఖ్యతను అంగీకరించారు.
మధ్యప్రాచ్యంలో శాంతి, సుస్థిరతకు తమ దృఢమైన మద్దతును ఇరువురు నేతలు పునరుద్ఘాటించారు. బందీల విడుదల ఒప్పందాన్ని, 2025 జనవరిలో కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించారు. బందీలందరినీ విడుదల చేయడం, గాజా అంతటా వేగవంతమైన, సురక్షితమైన అంతరాయం లేని మానవతా సహాయాన్ని అందించే అవకాశాన్ని కల్పించడం ద్వారా శాశ్వత శాంతిని సాధించడానికి చర్చలు కొనసాగించాలని వారు మరోసారి పిలుపు ఇచ్చారు. పాలస్తీనాలో సార్వభౌమ, ఆచరణీయమైన, స్వతంత్ర రాజ్య స్థాపనకు దారితీసే చర్చల ప్రాముఖ్యతను వారు పేర్కొన్నారు. అదే సమయంలో, ఇజ్రాయెల్‌తో కలిసి శాంతి, భద్రత కలిగిన, పరస్పరం గుర్తింపు పొందిన సరిహద్దుల్లో నివసించడానికి వీలు కల్పించే “రెండు దేశాల పరిష్కారం” అవసరాన్ని ప్రత్యేకంగా పేర్కొన్నారు.
ఉక్రెయిన్ యుద్ధంపై ఇరువురు నేతలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. అంతర్జాతీయ చట్టాలు, ఐక్యరాజ్యసమితి హక్కుల సూత్రాలు, ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమత్వం ఆధారంగా న్యాయసమ్మతమైన, సుస్థిరమైన శాంతికి మద్దతు తెలిపారు.
అన్ని రూపాలలోని ఉగ్రవాదాన్ని, సీమాంతర ఉగ్రవాదంలో ఉగ్రవాద ప్రాక్సీలను ఉపయోగించడాన్ని ఇద్దరు నాయకులు ఖండించారు. ఐక్యరాజ్యసమితి నిషేధించిన ఉగ్రవాద సంస్థలు, వ్యక్తులకు వ్యతిరేకంగా అన్ని దేశాలు తక్షణ, స్థిరమైన, గుర్తించదగిన పటిష్ట చర్యలు తీసుకోవడం అత్యవసరం అని వారు స్పష్టం చేశారు. ఉగ్రవాదులకు ఆర్థిక సహాయం అందించే వ్యవస్థలు, వారి సురక్షిత స్థావరాలను అడ్డుకోవాలని, ఆన్ లైన్ సహా ఉగ్రవాద మౌలిక సదుపాయాలను నిర్మూలించాలని, ఉగ్రవాదానికి పాల్పడిన వారిని సత్వరమే శిక్షించాలని వారు పిలుపునిచ్చారు. ద్వైపాక్షిక, బహుపాక్షిక యంత్రాంగాల ద్వారా ఉగ్రవాదం, హింసాత్మక తీవ్రవాదాన్ని ఎదుర్కోవడంలో పరస్పరం సహకరించుకోవాలని ఇరువురు నేతలు అంగీకరించారు.
ద్వైపాక్షిక సహకారంలో పురోగతిపై ఇరువురు ప్రధానులు సంతృప్తి వ్యక్తం చేశారు. పరస్పర ప్రయోజనంతో పాటు ఇండో–పసిఫిక్ ప్రాంత ప్రయోజనం కోసం ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని మరింత పటిష్టంగా, లోతుగా చేయడానికి తమ నిబద్ధతను పునరుద్ఘాటించారు. ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసే అవకాశాలను అన్వేషించాలని, హరిత, వ్యవసాయ సాంకేతిక రంగాల్లో సహకారానికి కొత్త మార్గాలను అన్వేషించాలని వారు పిలుపునిచ్చారు.
భారత పర్యటన సందర్భంగా తనకు, తన ప్రతినిధి బృంద సభ్యులకు అందించిన సాదర స్వాగతానికి, ఆతిథ్యానికి గాను ప్రధాని మోదీకి, భారత ప్రభుత్వానికి, భారత ప్రజలకు న్యూజిలాండ్ ప్రధాన మంత్రి లక్సన్ ధన్యవాదాలు తెలిపారు. న్యూజిలాండ్ పర్యటనకు రావాలని ప్రధాని మోదీని… లక్సన్ ఆహ్వానించారు.
Addressing the press meet with PM @chrisluxonmp of New Zealand. https://t.co/I3tR0rHpeI
— Narendra Modi (@narendramodi) March 17, 2025
मैं प्रधानमंत्री लक्सन और उनके प्रतिनिधिमंडल का भारत में हार्दिक स्वागत करता हूँ।
— PMO India (@PMOIndia) March 17, 2025
प्रधानमंत्री लक्सन भारत से लंबे समय से जुड़े हुए हैं।
कुछ दिन पहले, ऑकलैंड में, होली के रंगों में रंगकर उन्होंने जिस तरह उत्सव का माहौल बनाया, वह हम सबने देखा: PM @narendramodi
आज हमने अपने द्विपक्षीय संबंधों के विभिन्न पहलुओं पर विस्तृत चर्चा की।
— PMO India (@PMOIndia) March 17, 2025
हमने अपनी रक्षा और सुरक्षा साझेदारी को मजबूत और संस्थागत रूप देने का निर्णय लिया है।
Joint Exercises, Training, Port Visits के साथ साथ रक्षा उद्योग जगत में भी आपसी सहयोग के लिए रोडमैप बनाया जायेगा: PM…
दोनों देशों के बीच एक परस्पर लाभकारी Free Trade Agreement पर negotiations शुरू करने का निर्णय लिया गया है।
— PMO India (@PMOIndia) March 17, 2025
इससे आपसी व्यापार और निवेश के potential को बढ़ावा मिलेगा: PM @narendramodi
हमने Sports में कोचिंग और खिलाड़ियों के exchange के साथ-साथ, Sports Science, साइकोलॉजी और medicine में भी सहयोग पर बल दिया है।
— PMO India (@PMOIndia) March 17, 2025
और वर्ष 2026 में, दोनों देशों के बीच खेल संबंधों के 100 साल मनाने का निर्णय लिया है: PM @narendramodi
इस संदर्भ में न्यूजीलैंड में कुछ गैर-कानूनी तत्वों द्वारा भारत-विरोधी गतिविधियों को लेकर हमने अपनी चिंता साझा की।
— PMO India (@PMOIndia) March 17, 2025
हमें विश्वास है कि इन सभी गैर-कानूनी तत्वों के खिलाफ हमें न्यूजीलैंड सरकार का सहयोग आगे भी मिलता रहेगा: PM @narendramodi
चाहे 15 मार्च 2019 का क्राइस्टचर्च आतंकी हमला हो या 26 नवंबर 2008 का मुंबई हमला, आतंकवाद किसी भी रूप में अस्वीकार्य है।
— PMO India (@PMOIndia) March 17, 2025
आतंकी हमलों के दोषीयों के खिलाफ कड़ी कार्रवाई आवश्यक है।
आतंकवादी, अलगाववादी और कट्टरपंथी तत्वों के खिलाफ हम मिलकर सहयोग करते रहेंगे: PM @narendramodi
Free, Open, Secure, और Prosperous इंडो-पैसिफिक का हम दोनों समर्थन करते हैं।
— PMO India (@PMOIndia) March 17, 2025
हम विकासवाद की नीति में विश्वास रखते हैं, विस्तारवाद में नहीं।
Indo-Pacific Ocean Initiative से जुड़ने के लिए हम न्यूजीलैंड का स्वागत करते हैं।
International Solar Alliance के बाद, CDRI से जुड़ने के…