పిఎంఇండియా
ప్రఖ్యాత పాడ్ కాస్ట్ వ్యాఖ్యాత, ఏఐ పరిశోధకుడు లెక్స్ ఫ్రిడ్‌మన్ తో ప్రధాన మంత్రి, శ్రీ నరేంద్ర మోదీ విశ్లేషణాత్మక సంభాషణలో పాల్గొన్నారు. మూడు గంటల పాటు సాగిన ఈ సంభాషణలో విభిన్న అంశాలపై చర్చించారు. ప్రధాన మంత్రి మోదీ చిన్ననాటి జ్ఞాపకాలు, హిమాలయాల్లో ఆయన గడిపిన క్షణాలు, ప్రజా జీవితంలో ఆయన ప్రయాణంపై మాట్లాడారు. అత్యంత ఆసక్తితో ఎదురుచూస్తున్న ఈ మూడు గంటల పోడ్‌కాస్ట్ రేపు అంటే మార్చి 16, 2025న విడుదల కానుంది. ఈ సంభాషణను తన జీవితంలో “అత్యంత ప్రభావవంతమైన సంభాషణల్లో ఒకటి”గా లెక్స్ ఫ్రిడ్‌మన్ అభివర్ణించారు..
రాబోయే పాడ్ కాస్ట్ గురించి లెక్స్ ఫ్రిడ్‌మన్ ‘ఎక్స్’లో చేసిన పోస్టుకు స్పందిస్తూ, శ్రీ మోదీ ఎక్స్‌లో ఇలా పేర్కొన్నారు;
“@lexfridmanతో ఆసక్తికర సంభాషణ జరిగింది. నా బాల్యానికి సంబంధించిన జ్ఞాపకాలు, హిమాలయాల్లో గడిపిన సమయం, ప్రజా జీవితంలో నా ప్రయాణం వంటి విభిన్న అంశాలను చర్చించాం.
ఈ సంభాషణలో మీరు కూడా భాగస్వాములై తప్పక వీక్షించండి”
***
It was indeed a fascinating conversation with @lexfridman, covering diverse topics including reminiscing about my childhood, the years in the Himalayas and the journey in public life.
— Narendra Modi (@narendramodi) March 15, 2025
Do tune in and be a part of this dialogue! https://t.co/QaJ04qi1TD
I had an epic 3-hour podcast conversation with @narendramodi, Prime Minister of India.
— Lex Fridman (@lexfridman) March 15, 2025
It was one of the most powerful conversations of my life.
It'll be out tomorrow. pic.twitter.com/KmRSFfVRKg