Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

‘నాగరికదేవో భవ’ స్ఫూర్తితో ‘సేవా తీర్థ్’ను జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి కర్తవ్యం, కరుణ, ఇండియా ఫస్ట్ దార్శనికత పట్ల నిబద్ధతకు చిహ్నంగా ‘సేవా తీర్థ్’

‘నాగరికదేవో భవ’ స్ఫూర్తితో ‘సేవా తీర్థ్’ను జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి  కర్తవ్యం, కరుణ, ఇండియా ఫస్ట్ దార్శనికత పట్ల నిబద్ధతకు చిహ్నంగా ‘సేవా తీర్థ్’


ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సేవా తీర్థ్‌ను జాతికి అంకితం చేశారు. భారత ప్రజలకు సేవ చేయాలనే తన అచంచల సంకల్పాన్ని పునరుద్ఘాటిస్తూ… ‘నాగరికదేవో భవ‘ పవిత్ర స్ఫూర్తిని దానికి మార్గదర్శక శక్తిగా ప్రకటించారు.

సేవా తీర్థ్ అంకితభావం… ప్రజాసేవ, పౌరుల సంక్షేమాల పట్ల లోతైన నిబద్ధతను ప్రతిబింబిస్తుందని శ్రీ మోదీ పేర్కొన్నారు.

కర్తవ్యం, కరుణ, ‘ఇండియా ఫస్ట్’ దార్శనికత పట్ల నిబద్ధతలకు ‘సేవాతీర్థ్’ ప్రకాశవంతమైన, శక్తిమంతమైన చిహ్నంగా నిలుస్తుందని ప్రధానమంత్రి అన్నారు.

నిస్వార్థ సేవ చేస్తూ, ప్రజా సంక్షేమం కోసం అవిశ్రాంత అంకితభావంతో తర్వాతి తరాలు ముందుకు సాగేందుకు ఇది స్ఫూర్తినిస్తుందనీ, ప్రజలనూ ఈ దిశగా ముందుకు నడిపిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

‘ఎక్స్’ వేదికగా ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

“భారత ప్రజలకు సేవ చేయాలనే అచంచలమైన సంకల్పంతో… నాగరిక్ దేవో భవ అనే పవిత్ర భావన మార్గదర్శనంతో… సేవా తీర్థ్‌ను సవినయంగా జాతికి అంకితం చేశాం.

సేవా తీర్థ్ ఎల్లప్పుడూ కర్తవ్యం, కరుణ, ఇండియా ఫస్ట్ దార్శనికత పట్ల నిబద్ధతలకు ప్రకాశవంతమైన చిహ్నంగా నిలుస్తుంది. ఇది తరతరాలు నిస్వార్థ సేవతో, ప్రజలందరి సంక్షేమం పట్ల అవిశ్రాంత అంకితభావంతో ముందుకు సాగేందుకు స్ఫూర్తినిస్తుంది.”

 

****