పిఎంఇండియా
తమిళనాడులోని మధురై విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదాని ప్రకటిస్తూ ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ అధ్యక్షతన ఈ రోజు నిర్వహించిన మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.
టెంపుల్ సిటీగా పిలిచే తమిళనాడులోని మధురై విమానాశ్రయం ఆ రాష్ట్రంలోని పాత విమానాశ్రయాల్లో ఒకటి. దక్షిణ తమిళనాడుకి ఇది ముఖద్వారంగా ఉంది. పర్యాటకాన్ని, తీర్థయాత్రలను ప్రోత్సహించడంలో కీలకపాత్ర పోషించడమే కాకుండా ఈ ప్రాంత సమగ్రాభివృద్ధికి తోడ్పడుతుంది.
మధురై విమానాశ్రయాన్ని అంతర్జాతీయ హోదా స్థాయికి పెంచడం ద్వారా ప్రాంతీయంగా రవాణా సదుపాయం విస్తరిస్తుంది. వాణిజ్యం, ఆర్థికాభివృద్ధి మెరుగవుతాయి. ఈ నగర చారిత్రక ప్రాముఖ్యతకు సరితూగేలా అంతర్జాతీయ భక్తులను, వ్యాపారాలను ఈ విమానాశ్రయం ఆకర్షిస్తుంది.
***