పిఎంఇండియా
ప్రాంతీయ పరిణామాలు, ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయటంపై ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ అధ్యక్షుడు గౌరవ డాక్టర్ మసౌద్ పెజెష్కియాన్‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ఫోన్లో మాట్లాడారు.
ఈద్, నౌరుజ్ పర్వదినాల సందర్భంగా ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ మసూద్ పెజెష్కియాన్‌కు ప్రధానమంత్రి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండగ సీజన్ పశ్చిమాసియా ప్రాంతంలో శాంతి, స్థిరత్వం, సుసంపన్నతను తీసుకువస్తుందని ఇరువురు నేతలు ఆకాంక్షించారు. ప్రాంతీయ స్థిరత్వాన్ని దెబ్బతీస్తూ.. ప్రపంచ సరఫరా వ్యవస్థకు అంతరాయం కలిగించేలా మౌలిక సదుపాయాలపై జరుగుతున్న దాడులను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఖండించారు. సముద్రయాన స్వేచ్ఛను కాపాడటం, అంతర్జాతీయ రవాణా మార్గాల్లో భద్రత ఉండేలా, అంతరాయం లేకుండా చూడటం కీలకమని స్పష్టం చేశారు. ఇరాన్లో ఉన్న భారత పౌరుల రక్షణ, భద్రత పట్ల ఆ దేశ మద్దతుకు శ్రీ నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్‘లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
“ఈద్, నౌరుజ్ పర్వదినాల సందర్భంగా ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ మసూద్ పెజెష్కియాన్‌తో మాట్లాడి, శుభాకాంక్షలు తెలిపాను. ఈ పండగ సీజన్ పశ్చిమాసియా ప్రాంతంలో శాంతి, స్థిరత్వం, సుసంపన్నత కలగాలని ఆశిస్తున్నాం.
ప్రాంతీయ స్థిరత్వాన్ని దెబ్బతీస్తూ.. ప్రపంచ సరఫరా వ్యవస్థకు అంతరాయం కలిగించేలా మౌలిక సదుపాయాలపై జరుగుతున్న దాడులను ఖండించాం.
సముద్రయాన స్వేచ్ఛను కాపాడటం, అంతర్జాతీయ రవాణా మార్గాల్లో భద్రత ఉండేలా, అంతరాయం లేకుండా చూడటం కీలకమని స్పష్టం చేశాం.
ఇరాన్లో ఉన్న భారతీయ పౌరుల భద్రత, రక్షణకు ఆ దేశ ప్రభుత్వం అందిస్తున్న నిరంతర సహకారానికి అభినందనలు“.
Spoke with President Dr. Masoud Pezeshkian and conveyed Eid and Nowruz greetings. We expressed hope that this festive season brings peace, stability and prosperity to West Asia.
— Narendra Modi (@narendramodi) March 21, 2026
Condemned attacks on critical infrastructure in the region, which threaten regional stability and…