పిఎంఇండియా
మిత్రులారా,
ఈ సవరణ బిల్లు అన్ని పార్టీలు, అన్ని రాష్ట్రాలకు ఒక గొప్ప అవకాశం. ఒకవేళ ఈ బిల్లు ఆమోదం పొంది ఉంటే తమిళనాడు, బెంగాల్, ఉత్తరప్రదేశ్, కేరళ వంటి ప్రతి రాష్ట్రంలోనూ సీట్లు పెరిగేవి. కానీ తమ స్వార్థ రాజకీయాల వల్ల ఈ పార్టీలు తమ సొంత రాష్ట్ర ప్రజలకే నమ్మకద్రోహం చేశాయి. ఉదాహరణకు ‘డీఎంకే’కి ఎక్కువ మంది తమిళులను ఎంపీలు, ఎమ్మెల్యేలుగా చేసి తమిళనాడు గొంతుకను బలోపేతం చేసే అవకాశం ఉండేది! కానీ అది ఆ అవకాశాన్ని కోల్పోయింది. అలాగే టీఎంసీకి కూడా బెంగాల్ ప్రజలను అభివృద్ధి పథంలో నడిపించే అవకాశం ఉండేది. కానీ టీఎంసీ కూడా ఆ అవకాశాన్ని వదులుకుంది. సమాజ్‌వాదీ పార్టీకి తనపై ఉన్న మహిళా వ్యతిరేక ముద్రను తొలగించుకునే అవకాశం ఉండేది. కానీ ఎస్పీ దానిని కూడా వదులుకుంది. ఎస్పీ ఇప్పటికే లోహియా గారిని మర్చిపోయింది. ‘నారీ శక్తి వందన్‘ సవరణను వ్యతిరేకించడం ద్వారా ఎస్పీ లోహియా గారి ఆశయాలన్నింటినీ అడుగుల్లో తొక్కివేసింది. ఎస్పీ మహిళా రిజర్వేషన్లకు వ్యతిరేకం.. ఈ విషయాన్ని ఉత్తరప్రదేశ్, దేశంలోని మహిళలు ఎప్పటికీ మర్చిపోరు.
మిత్రులారా,
మహిళా రిజర్వేషన్లను వ్యతిరేకించడం ద్వారా కాంగ్రెస్ మరోసారి ఒక విషయాన్ని నిరూపించింది. కాంగ్రెస్ ఒక సంస్కరణల వ్యతిరేక పార్టీ. 21వ శతాబ్దపు అభివృద్ధి చెందిన భారత్ కోసం ఏ నిర్ణయాలు, ఏ సంస్కరణలు అవసరమో దేశం తీసుకునే ఆ నిర్ణయాలను కాంగ్రెస్ వ్యతిరేకిస్తుంది.. తిరస్కరిస్తుంది.. అడ్డుకుంటుంది. ఇదే కాంగ్రెస్ చరిత్ర.. ఇదే కాంగ్రెస్ అనుసరించే ప్రతికూల రాజకీయాలు.
మిత్రులారా,
కాంగ్రెస్ ఒక సంస్కరణల వ్యతిరేక పార్టీ. జన్ ధన్–ఆధార్–మొబైల్ త్రయాన్ని వ్యతిరేకించిన కాంగ్రెస్ ఇది. కాంగ్రెస్ డిజిటల్ చెల్లింపులను వ్యతిరేకించింది. కాంగ్రెస్ జీఎస్టీని వ్యతిరేకించింది. జనరల్ క్యాటగిరిలోని పేదలకు రిజర్వేషన్‌ను కాంగ్రెస్ వ్యతిరేకించింది. ట్రిపుల్ తలాక్‌కు వ్యతిరేకంగా ఉన్న చట్టాన్ని కాంగ్రెస్ వ్యతిరేకించింది. యూనిఫాం సివిల్ కోడ్ అవసరమని మన రాజ్యాంగం, మన కోర్టులు చెప్పాయి. కానీ కాంగ్రెస్ దానిని కూడా వ్యతిరేకిస్తోంది. సంస్కరణ అనే మాట ఎత్తగానే కాంగ్రెస్ నిరసన ప్లకార్డులతో పరుగులు తీస్తుంది. దేశాన్ని బలోపేతం చేసే ఏ పనినైనా అందులో అడ్డంకులు సృష్టించడానికి కాంగ్రెస్ తన శక్తినంతటినీ ఉపయోగిస్తుంది. ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్‘ను కాంగ్రెస్ వ్యతిరేకిస్తోంది. దేశం నుంచి చొరబాటుదారులను పంపించే ప్రయత్నాలను కాంగ్రెస్ వ్యతిరేకిస్తోంది. ఓటర్ల జాబితా శుద్దీకరణ అయిన సర్‌ను కాంగ్రెస్ వ్యతిరేకిస్తోంది. వక్ఫ్ బోర్డులో సంస్కరణలను కూడా కాంగ్రెస్ వ్యతిరేకిస్తోంది.
మిత్రులారా,
శరణార్థులకు భద్రత కల్పించే సీఏఏ చట్టాన్ని కూడా కాంగ్రెస్ వ్యతిరేకించింది. అబద్ధాలు చెప్పి వదంతులు వ్యాప్తి చేయడం ద్వారా దేశంలో అలజడిని సృష్టించింది. మావోయిస్టు–నక్సలైట్ హింసను అంతం చేయడానికి దేశం చేస్తున్న ప్రయత్నాలకు కాంగ్రెస్ అడ్డుపడుతోంది. ఎప్పుడు సంస్కరణలు వచ్చినా అబద్ధాలు చెప్పడం గందరగోళాన్ని సృష్టించడం అనేది కాంగ్రెస్‌కు ఒకే ఒక పద్ధతి ఉంది. చరిత్రనే సాక్షి.. కాంగ్రెస్ ఎప్పుడూ ఈ ప్రతికూల మార్గాన్నే ఎంచుకుంది.
మిత్రులారా,
దేశానికి ఏ నిర్ణయం అవసరమైనా కాంగ్రెస్ దానిని మూలన పడేస్తుంది. కాంగ్రెస్‌కు ఉన్న ఈ వైఖరి కారణంగానే భారత్ చేరుకోవాల్సిన అభివృద్ధి శిఖరాలను అందుకోలేకపోయింది. స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో మనతో పాటే అనేక దేశాలకు కూడా స్వాతంత్ర్యం లభించింది. ఆ దేశాల్లో చాలా వరకు మనకంటే ఎంతో ముందుకెళ్లాయి.. దానికి కారణం కాంగ్రెస్ ప్రతి సంస్కరణను అడ్డుకుంటూనే రావడం. జాప్యం, తప్పుదోవ పట్టించడం, అడ్డంకులు సృష్టించడం.. ఇదే కాంగ్రెస్ సూత్రం– ఇదే కాంగ్రెస్ పని సంస్కృతి. పొరుగు దేశాలతో సరిహద్దు వివాదాలను కాంగ్రెస్ వాయిదా వేసింది. పాకిస్థాన్‌తో నీటి పంపిణీ వివాదాలను కాంగ్రెస్ ఆలస్యం చేసింది. ఓబీసీ రిజర్వేషన్ల నిర్ణయాన్ని కాంగ్రెస్ 40 ఏళ్ల పాటు వాయిదా వేసింది. సైనికుల కోసం ‘వన్ ర్యాంక్ వన్ పెన్షన్‘ను కాంగ్రెస్ 40 ఏళ్ల పాటు ఆలస్యం చేసింది.
మిత్రులారా,
కాంగ్రెస్‌కు ఉన్న ఈ వైఖరి దేశానికి ఎప్పుడూ గొప్ప నష్టాన్ని కలిగించింది. కాంగ్రెస్ చేసిన ప్రతి వ్యతిరేక ప్రతి అనిశ్చిత నిర్ణయం ప్రతి మోసం వల్ల దేశం నష్టపోయింది. దేశంలోని తరతరాలు బాధపడ్డాయి. నేడు దేశం ముందున్న ప్రధాన సవాళ్లన్నీ కాంగ్రెస్‌కు ఉన్న ఈ వైఖరి నుండే ఉద్భవించాయి. అందుకే ఈ పోరాటం కేవలం ఒక చట్టానికి సంబంధించినది మాత్రమే కాదు. ఈ పోరాటం పూర్తిగా ప్రతికూలతతో నిండిన కాంగ్రెస్ సంస్కరణ–వ్యతిరేక మనస్తత్వానికి వ్యతిరేకమైంది. కాంగ్రెస్‌కు ఉన్న ఈ మనస్తత్వానికి దేశంలోని మహిళలు, కుమార్తెలు గట్టి సమాధానం ఇస్తారన్న విషయంలో నాకు ఎటువంటి సందేహం లేదు.
మిత్రులారా,
దేశంలోని మహిళల కలలు భగ్నం కావడాన్ని కొందరు ప్రభుత్వ వైఫల్యంగా చిత్రీకరిస్తున్నారు. కానీ ఈ విషయం ఎప్పుడూ విజయం లేదా వైఫల్యానికి సంబంధించింది కాదు.. క్రెడిట్ గురించి అసలే కాదు. ‘దేశంలోని సగం జనాభాకు వారి హక్కులు దక్కనివ్వండి– వారి ఫోటోలన్నింటినీ ప్రకటనల్లో ముద్రించి క్రెడిట్ అంతా ప్రతిపక్షాలకే ఇస్తాను అని’ నేను పార్లమెంటులో కూడా చెప్పాను.. కానీ మహిళలను పాతకాలపు ఆలోచనలతో చూసేవారు ఇప్పటికీ తమ అబద్ధాలకే కట్టుబడి మొండిగా వ్యవహరిస్తున్నారు!
మిత్రులారా,
మహిళలకు అధికారంలో భాగస్వామ్యం కల్పించే పోరాటం దశాబ్దాలుగా జరుగుతోంది. ఎన్నో ఏళ్లుగా ఆ కృషిలో నేను కూడా ఒకడిగా భాగస్వామినయ్యాను. ఎంతోమంది మహిళలు ఈ విషయాన్ని నా దృష్టికి తీసుకువచ్చారు. ఎంతోమంది సోదరీమణులు నాకు లేఖలు రాసి తమ ఆవేదనను వివరించారు. నా దేశపు తల్లులు, సోదరీమణులు, కుమార్తెలు.. మీరందరూ ఈ రోజు బాధపడుతున్నారని నాకు తెలుసు. మీ దుఃఖంలో నేను కూడా భాగస్వామినే. ఈ రోజు బిల్లు ఆమోదం పొందడానికి అవసరమైన 66 శాతం ఓట్లు రాలేదనేది నిజమే కావచ్చు.. కానీ దేశంలోని నూటికి నూరు శాతం మహిళా శక్తి మాకు ఆశీస్సులను అందించిందని నేను నమ్ముతున్నాను. దేశంలోని ప్రతి మహిళకు నేను హామీ ఇస్తున్నాను.. మహిళా రిజర్వేషన్ల మార్గంలో ఎదురయ్యే ప్రతి అడ్డంకిని మేము తొలగిస్తాం. మా ధైర్యం గొప్పది.. మా సంకల్పం దృఢమైనది.. మా నిశ్చయం అచంచలమైనది. మహిళా రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్న పార్టీలు పార్లమెంటు– శాసనసభలలో మహిళల భాగస్వామ్యం పెరగకుండా ఎప్పటికీ అడ్డుకోలేవు. ఇది కేవలం సమయం మాత్రమే. మహిళా శక్తి సాధికారత పట్ల బీజేపీ–ఎన్డీయే సంకల్పం చెక్కుచెదరలేదు. నిన్న మనకు సంఖ్యాబలం లేకపోవచ్చు కానీ అంతమాత్రాన మనం ఓడిపోయినట్లు కాదు. మన అంతర్గత శక్తి అజేయమైనది. మన ప్రయత్నం ఆగదు.. మన ప్రయత్నం విరామం తీసుకోదు. భవిష్యత్తులో మనకు మరిన్ని అవకాశాలు వస్తాయి. దేశ జనాభాలో సగభాగమైన మహిళల కలల కోసం, దేశ భవిష్యత్తు కోసం ఈ సంకల్పాన్ని మనం నెరవేర్చి తీరాలి. మీ అందరికీ చాలా ధన్యవాదాలు.
గమనిక: ప్రధానమంత్రి హిందీలో చేసిన ప్రసంగం అనువాదం ఇది.
***
My address to the nation. https://t.co/2Vyx15A4rx
— Narendra Modi (@narendramodi) April 18, 2026
नारी सब भूल जाती है, अपना अपमान कभी नहीं भूलती: PM @narendramodi pic.twitter.com/A76uJkfOlK
— PMO India (@PMOIndia) April 18, 2026
संसद में नारीशक्ति वंदन संशोधन का जिन भी दलों ने विरोध किया है, वे लोग नारी शक्ति को for granted ले रहे हैं: PM @narendramodi pic.twitter.com/W23Fwq214H
— PMO India (@PMOIndia) April 18, 2026
नारी शक्ति वंदन संशोधन 21वीं सदी की महिलाओं को सशक्त बनाने का एक ‘महायज्ञ’ था। pic.twitter.com/ckEZw7KGWd
— PMO India (@PMOIndia) April 18, 2026
नारी शक्ति वंदन अधिनियम के विरोध की एक बड़ी वजह है... इन परिवारवादी पार्टियों का डर। pic.twitter.com/tmLu8HeqeG
— PMO India (@PMOIndia) April 18, 2026
कांग्रेस, एक एंटी रिफॉर्म पार्टी है। pic.twitter.com/8JuChzCVWn
— PMO India (@PMOIndia) April 18, 2026
कांग्रेस के एंटी रिफॉर्म रवैये ने हमेशा देश का बहुत बड़ा नुकसान किया है। pic.twitter.com/XmLtrjZOnL
— PMO India (@PMOIndia) April 18, 2026
देश की 100 परसेंट नारीशक्ति का आशीर्वाद हमारे साथ है: PM @narendramodi pic.twitter.com/AGEu61h5nS
— PMO India (@PMOIndia) April 18, 2026
हम महिला आरक्षण के रास्ते में आने वाले हर रुकावट को खत्म करेंगे: PM @narendramodi pic.twitter.com/1kdNM1WGNl
— PMO India (@PMOIndia) April 18, 2026
महिलाओं से उनके अधिकार छीनकर ये लोग मेजें थपथपा रहे थे।
— PMO India (@PMOIndia) April 18, 2026
वो नारी के स्वाभिमान पर...उसके आत्मसम्मान पर चोट थी। pic.twitter.com/a0G8cH6hrq
कांग्रेस, महिला आरक्षण के विषय से ही नफरत करती है।
— PMO India (@PMOIndia) April 18, 2026
उसने हमेशा ही महिला आरक्षण को रोकने के लिए षड्यंत्र किए हैं! pic.twitter.com/IsmdqPAYUc
महिला आरक्षण का विरोध करके जो पाप विपक्ष ने किया है... इसकी उन्हें सजा जरूर मिलेगी। pic.twitter.com/32UlMi5oNe
— PMO India (@PMOIndia) April 18, 2026
महिला आरक्षण का विरोध करके विपक्षी दलों ने संविधान निर्माताओं की भावनाओं का अपमान किया है। देश की नारी शक्ति के स्वाभिमान और आत्मसम्मान पर चोट करने वाले अब माताओं-बहनों और बेटियों के आक्रोश से बच नहीं पाएंगे। pic.twitter.com/bEvWmYIlQo
— Narendra Modi (@narendramodi) April 18, 2026
नारी शक्ति वंदन अधिनियम से जुड़ा संशोधन भारतवर्ष की नारी को नई उड़ान देने का महायज्ञ था। लेकिन कांग्रेस, TMC, समाजवादी पार्टी और DMK जैसे दलों ने इसकी भ्रूणहत्या कर दी। pic.twitter.com/EOH9dG0iI9
— Narendra Modi (@narendramodi) April 18, 2026
मुझे व्यक्तिगत तौर पर आशा थी कि महिला आरक्षण को लेकर कांग्रेस अपने पापों का प्रायश्चित करेगी। लेकिन उसने एक बार फिर इस अवसर को खो दिया। pic.twitter.com/4xPgXQONV0
— Narendra Modi (@narendramodi) April 18, 2026
नारी शक्ति वंदन अधिनियम के विरोध की एक बड़ी वजह है- परिवारवादी पार्टियों का डर! उन्हें लगता है कि महिलाएं सशक्त हो गईं, तो उनका नेतृत्व खतरे में पड़ जाएगा। pic.twitter.com/Y6nDnN6swS
— Narendra Modi (@narendramodi) April 18, 2026