Search

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

నైపుణ్యం, కఠోర శ్రమ, విద్య, వినమ్రమైన మాట తీరు.. ఈ సద్గుణాలను చాటిచెప్పే


నైపుణ్యం, కఠోర శ్రమ, విద్య, కరుణ.. ఇవి మానవ జీవితంలో అద్భుత శక్తులని చాటిచెబుతున్న సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పంచుకున్నారు. వీటితో మనం అన్ని సవాళ్లనూ అధిగమించడంతో పాటు మన లక్ష్యాలను సాధించుకోవడంలో సహాయాన్ని కూడా పొందవచ్చని ఆయన స్పష్టం చేశారు.
నైపుణ్యం కలిగిన వారికి ఏ పనీ కఠినమైంది కాదని కూడా ప్రధానమంత్రి అన్నారు. కష్టపడి పనిచేసే వారికి ఏ లక్ష్యమూ అందుకోలేనిది కాదు.. విద్యావంతులకు స్వదేశం, విదేశం అన్న తేడా ఉండదు.. అలాగే, నమ్రతతో మాటలాడే వారికి ఎవ్వరూ అపరిచితులుగా అనిపించరని ప్రధానమంత్రి వివరించారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో  ఒక సందేశాన్ని ప్రధానమంత్రి శ్రీ మోదీ పొందుపరుస్తూ –
‘‘
కౌశలం, పరిశ్రమ, కరుణ.. ఇవి మన జీవనంలో అద్భుత శక్తులు. వీటితో మనం ప్రతి సవాలునూ ఎదుర్కొని, పైచేయిని సాధించవచ్చు. అంతేకాదు, ఇవి మన లక్ష్యాలను నెరవేర్చుకోవడంలోనూ తోడ్పడతాయి.
కో హి భారః సమర్థానాం కిం దూరం వ్యవసాయినామ్
కో విదేశః సువిద్యానాం కః పరః ప్రియవాదినామ్’’ అని పేర్కొన్నారు.

నైపుణ్యం కలిగిన వారికి ఏ పనీ కఠినమైంది కాబోదు. కష్టించి పనిచేసే వారికి ఏ లక్ష్యమైనా నెరవేర్చుకోలేనిదిగా ఉండదు. విద్యావంతులకు ఇది తమ సొంత దేశం, పరాయి దేశం అనే తేడాలంటూ ఉండవు. మరి అలాగే వినమ్రంగా మాట్లాడే వారికి ఎవ్వరూ అపరిచితులుగా మిగలరని ఈ సూక్తి మనకు బోధిస్తోంది.

***