Search

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

వడోదరకు వెళ్లే మార్గంలో తీసిన సోమనాథ్ ఆలయం ఫోటోను ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి


సోమనాథ్ నుంచి వడోదరకు వెళ్లే మార్గంలో తీసిన సోమనాథ్ ఆలయం ఫోటోను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు ప్రజలతో పంచుకున్నారు.

భక్తి, చరిత్ర, నాగరిక స్ఫూర్తికి ప్రభాస్ పటాన్ తీరాన కొలువై ఉన్న సోమనాథ్ ఆలయం ప్రకాశవంతమైన ప్రతీకగా సగర్వంగా నిలిచి ఉందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. అనేక దాడులను, దండయాత్రలను, శతాబ్దాల పాటు ఎదురైన క్లిష్ట పరిస్థితులను తట్టుకుని ఈ ఆలయం అజేయంగా నిలిచిందని శ్రీ మోదీ అన్నారు.

సోమనాథ్ క్షేత్రం ప్రతి భారతీయునికి బలాన్ని, ధైర్యాన్ని, కొత్త ఆశను ఇస్తుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

 

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో చేసిన వరుస పోస్టుల్లో ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు.

‘‘సోమనాథ్ నుంచి వడోదర వెళ్లే మార్గంలో ఈ ఫోటో తీశాను.

ప్రభాస్ పటాన్ తీరాన ఉన్న సోమనాథ్ ఆలయం భక్తికి, చరిత్రకు, మన నాగరికతా స్ఫూర్తికి ప్రకాశవంతమైన ప్రతీకగా సగర్వంగా నిలిచి ఉంది. అనేక దాడులు, విదేశీ ఆక్రమణలు, శతాబ్దాల తరబడి సవాళ్లను తట్టుకుని ఈ క్షేత్రం అజేయంగా నిలిచింది. ఇది శాశ్వతమైనది. సోమనాథ్‌ ప్రతి భారతీయుడికి బలాన్ని, ధైర్యాన్ని, కొత్త ఆశను ప్రసాదిస్తుంది.

హర హర మహాదేవ్’’