పిఎంఇండియా
జ్ఞానం జీవితానికి ఒక గొప్ప పెట్టుబడి అని, దాని సాయంతో మనిషి జీవితంలో ఎంత పెద్ద లక్ష్యాన్ని అయినా సాధించవచ్చని చెప్పే ఒక సంస్కృత సుభాషితాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు. జ్ఞానం మనల్ని అజ్ఞానమనే చీకటి నుంచి బయటకు తీసుకువచ్చి, విజయం, ఆత్మవిశ్వాసం వైపు నడిపిస్తుందని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.
ప్రధానమంత్రి పంచుకున్న సంస్కృత సుభాషితం..
‘‘విద్వాన్ ప్రశస్యతే లోకే
విద్వాన్ సర్వత్ర గౌరవం।
విద్యా లభతే సర్వం
విద్యా సర్వత్ర పూజ్యతే॥’’
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో చేసిన పోస్టులో ఈ విధంగా పేర్కొన్నారు.
‘‘విద్య జీవితానికి ఒక అద్భుతమైన మూలధనం. దీనితో ఎంతటి గొప్ప లక్ష్యాలనైనా సాధించవచ్చు. విద్య మనల్ని అజ్ఞానమనే చీకటి నుంచి బయటకు తీసుకువచ్చి, విజయపథం వైపు, ఆత్మవిశ్వాసం వైపు నడిపిస్తుంది.
‘‘విద్వాన్ ప్రశస్యతే లోకే
విద్వాన్ సర్వత్ర గౌరవం।
విద్యా లభతే సర్వం
విద్యా సర్వత్ర పూజ్యతే॥’’
विद्या जीवन की ऐसी पूंजी है, जिससे बड़े से बड़े लक्ष्य को हासिल किया जा सकता है। विद्या हमें अज्ञानता के अंधकार से निकालकर सफलता और आत्मविश्वास की ओर ले जाती है।
— Narendra Modi (@narendramodi) May 14, 2026
विद्वान् प्रशस्यते लोके
विद्वान् सर्वत्र गौरवम्।
विद्यया लभते सर्वं
विद्या सर्वत्र पूज्यते॥ pic.twitter.com/Tlwaynzy7r