Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భారత ప్రధానమంత్రి నెదర్లాండ్స్‌ పర్యటన సందర్భంగా రెండు దేశాల సంయుక్త ప్రకటన

భారత ప్రధానమంత్రి నెదర్లాండ్స్‌ పర్యటన సందర్భంగా  రెండు దేశాల సంయుక్త ప్రకటన


నెదర్లాండ్స్ ప్రధానమంత్రి గౌరవనీయ రాబ్‌ జెటెన్‌ ఆహ్వానం మేరకు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ నెల 16-17 తేదీలలో ఆ దేశంలో పర్యటించారుశ్రీ మోదీ నెదర్లాండ్స్‌లో  పర్యటించడం ఇది రెండోసారి.

ఈ సందర్భంగా 16వ తేదీన ఉదయం నెదర్లాండ్స్ రాజు మాననీయ విల్లెం అలెగ్జాండర్రాణి శ్రీమతి మాక్జిమా ద హేగ్‌లోని ‘హుయిస్ టెన్ బాష్’ రాజప్రాసాదంలో భారత ప్రధానమంత్రి మోదీకి ఆతిథ్యం ఇవ్వడంతోపాటు ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొన్నారుఅటుపైన శ్రీ మోదీ గౌరవార్థం రాచ దంపతులు మధ్యాహ్న విందు కూడా ఏర్పాటు చేశారు.

రెండు దేశాల ప్రధానమంత్రులు శ్రీ జెటెన్‌శ్రీ మోదీ 16వ తేదీ సాయంత్రం ముఖాముఖిప్రతినిధుల స్థాయి చర్చలు నిర్వహించడంతోపాటు ఆ రాత్రి విందులో పాల్గొన్నారుభారత్‌నెదర్లాండ్స్‌ మధ్యగల సుదీర్ఘ చారిత్రకవాణిజ్య సంబంధాలతోపాటు ప్రజల మధ్యగల బలమైన అనుబంధాన్నిద్వైపాక్షిక స్నేహాన్ని ప్రధానమంత్రులు ఇద్దరూ గుర్తు చేసుకున్నారుఈ బహుముఖ అనుబంధాన్ని మరింత విస్తరించడంతోపాటు పటిష్ఠం చేయాలని నిర్ణయానికి వచ్చారుదీనికి సంబంధించి అత్యున్నత రాజకీయ స్థాయిలోనూఅధికార యంత్రాంగాల మధ్య నిరంతర చర్చల ద్వారా వివిధ సహకార కార్యక్రమాలలో సాధించిన ప్రగతిపై వారిద్దరూ సంతృప్తి వ్యక్తం చేశారుముఖ్యంగా 2023లో భారత్‌ జి20కి అధ్యక్షత వహించిన సందర్భంలోనే కాకుండా 2026 ఫిబ్రవరిలో న్యూఢిల్లీలో “ఏఐ ఇంపాక్ట్ సమిట్” సమయంలోనూ రెండు దేశాల మధ్య సహకారంపై చర్చలు ఫలప్రదం కావడాన్ని వారు మరొకసారి స్మరించుకున్నారు.

రెండు దేశాల మధ్య సంబంధాలు వేగంగా విస్తరించడంతోపాటు పరస్పర అవగాహన ఇనుమడించడాన్ని వారు ప్రశంసించారుఈ బంధాన్ని భారత్నెదర్లాండ్స్ ‘వ్యూహాత్మక భాగస్వామ్యం’గా మలచాలని నిర్ణయించారుతదనుగుణంగా ‘వ్యూహాత్మక భాగస్వామ్య కార్యాచరణ ప్రణాళిక’ రూపకల్పనపై హర్షం వెలిబుచ్చారుఈ మేరకు రాజకీయాలువాణిజ్యంపెట్టుబడులురక్షణభద్రత రంగాల్లో సన్నిహిత సహకారానికి అంగీకరించారుఇవే కాకుండా సైబర్ భద్రతసెమీకండక్టర్లు సహా కీలకఅత్యాధునిక సాంకేతికతలుఅంతరిక్షంకృత్రిమ మేధ (ఏఐ), క్వాంటమ్ వ్యవస్థలుశాస్త్రవిజ్ఞానంఆవిష్కరణలు ఇందులో అంతర్భాగంగా ఉంటాయిఆరోగ్యం సంరక్షణసుస్థిర వ్యవసాయంఆహార వ్యవస్థలుజల నిర్వహణవాతావరణ మార్పుఇంధన మార్పిడిసుస్థిర రవాణాసముద్రయాన అభివృద్ధివిద్యసంస్కృతిప్రజల మధ్య సంబంధాలు సహా అన్ని రంగాల్లోనూ సహకార విస్తరణకు ఉభయ పక్షాలూ నిర్ణయించాయివిధానాల రూపకల్పనలోనూ (అభిప్రాయాల/అనుభవాలఆదానప్రదానంపై పరిశీలనకు నిర్ణయించారు.

ఇక వివిధ ప్రాధాన్య రంగాలకు సంబంధించి 2025 డిసెంబరు నాటి ఒప్పందాలపై నాయకులిద్దరూ హర్షం వ్యక్తం చేశారురక్షణసెమీకండక్టర్లువాటికి సంబంధించిన అత్యాధునిక సాంకేతిక రంగాలు కూడా ఇందులో భాగంగా ఉన్నాయిదీంతోపాటు డిజిటల్సైబర్ స్పేస్ రంగాలలో సహకార విస్తరణఔషధవైద్య పరికరాల రంగంలో భాగస్వామ్య ఒప్పందాలు కుదిరాయిఅంతేకాకుండా సంయుక్త వాణిజ్యపెట్టుబడుల కమిటీ ఏర్పాటు సహా లోథాల్ఆమ్‌స్టర్‌డ్యామ్‌లలోని సముద్రయాన మ్యూజియంల మధ్య సహకారంపై ఆనందం వ్యక్తం చేశారు.

రెండు దేశాల ప్రధానమంత్రులు ‘భవిష్యత్తు కోసం ఒప్పందం’ (పాక్ట్ ఫర్ ద ఫ్యూచర్అంశాన్ని తమ చర్చల్లో ప్రస్తావించారుప్రజాస్వామ్యంమానవ హక్కులుఅంతర్జాతీయ శాంతి భద్రతలతో పాటు ఐక్యరాజ్యసమితి నిర్దేశిత సూత్రబద్ధ అంతర్జాతీయ నిబంధనల అమలుకు కట్టుబడి ఉంటామని పునరుద్ఘాటించారునేటి సమకాలీన పరిస్థితులను  ప్రతిబింబించేలా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సంస్కరణలు తేవాలని స్పష్టం చేశారుఇందులో భాగంగా శాశ్వతతాత్కాలిక సభ్యత్వాల విభాగాలను విస్తరించాలని కోరారుదీనికి సంబంధించి నిర్దిష్ట వ్యవధిలోగా విస్పష్ట చర్చలు చేపట్టాలని సూచించారుసంస్కరించిన ఐక్యరాజ్యసమితి భద్రత మండలిలో భారత్‌ శాశ్వత సభ్యత్వం డిమాండుకు నెదర్లాండ్స్ మద్దతుకుగాను ప్రధానమంత్రి శ్రీ మోదీ…శ్రీ రాబ్‌ జెటెన్‌ కు ధన్యవాదాలు తెలిపారు.

భారత్ఐరోపా సమాఖ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పటిష్ఠం చేయడంపై నిబద్ధతను వారిద్దరూ పునరుద్ఘాటించారుఇందులో భాగంగా భారత్ఐరోపా సమాఖ్య ఉభయతారక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై ఈ ఏడాది జనవరిలో చర్చలు ముగియడంపై సంతృప్తి వ్యక్తం చేశారుభౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతోపాటు ప్రపంచ ఆర్థిక సవాళ్లు పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచంలోని రెండోనాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య రాజకీయఆర్థిక సంబంధాలను ఈ ఒప్పందం బలోపేతం చేస్తుందన్నారుమరోవైపు నియమాధారిత వాణిజ్యంపై ఉమ్మడి నిబద్ధత ఆర్థిక స్వేచ్ఛను స్పష్టం చేస్తుందని అంగీకరించారుభద్రతరక్షణ భాగస్వామ్య ఒప్పందంపై ఏకకాలంలో సంతకాలు పూర్తి కావడాన్ని నాయకులిద్దరూ స్వాగతించారుభద్రతరక్షణ రంగాలలో ఐరోపా సమాఖ్యభారత్‌ మధ్య చర్చలుసహకారాన్ని కూడా ఈ ఒప్పందం బలోపేతం చేస్తుందన్నారుఅంతేకాకుండా సముద్ర భద్రతసైబర్ నేరాల నిరోధంఉగ్రవాదం అణచివేతరక్షణ పారిశ్రామిక సహకారం వంటి రంగాలలో నిర్దిష్ట ఫలితాలను అందిస్తుందని పేర్కొన్నారు.

అంతర్జాతీయ చట్టంసార్వభౌమత్వంప్రాదేశిక సమగ్రతనౌకాయాన స్వేచ్ఛబలప్రయోగంసంఘర్షణలకు తావివ్వకపోవడం వంటివాటిపై గౌరవం ప్రాతిపదికన స్వేచ్ఛాబహిరంగసురక్షితశాంతియుత ఇండోపసిఫిక్ ప్రాధాన్యంపై నాయకులు ఏకాభిప్రాయం వెలిబుచ్చారుఇండోపసిఫిక్‌పై ఐరోపా సమాఖ్య వ్యూహాన్ని గుర్తుచేసుకుంటూ ‘ఇండోపసిఫిక్ ఓషన్స్ ఇనిషియేటివ్’లో చేరే దిశగా జర్మనీఐరోపా సమాఖ్యలతో కలిసి సామర్థ్య వికాసం వనరుల భాగస్వామ్యానికి సహ నాయకత్వంపై నెదర్లాండ్స్ నిర్ణయించుకున్నదని రాబ్‌ జెటెన్‌ ప్రకటించారు.

ఉక్రెయిన్రష్యా యుద్ధం కొనసాగుతుండటంపై భారత్‌నెదర్లాండ్స్‌ రెండూ ఆందోళన వ్యక్తం చేశాయిఇది మానవాళికి వేదనను మిగిల్చిందనిప్రపంచ పరిణామాలను వేగంగా మార్చేస్తోందని పేర్కొన్నారుఐక్యరాజ్యసమితి నియమాలుఅంతర్జాతీయ చట్ట సూత్రాల ఆధారంగా చర్చలుదౌత్యంతో ఉక్రెయిన్‌లో సమగ్రసముచితశాశ్వత శాంతి సాధన కృషికి మద్దతు కొనసాగించాలని నాయకులిద్దరూ అంగీకరించారు.

పశ్చిమాసియాలో పరిస్థితులపై నాయకులిద్దరూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారుయావత్‌ మానవాళి ఎదుర్కొంటున్న కష్టనష్టాలుప్రపంచ ఇంధన సరఫరావాణిజ్య నెట్‌వర్క్‌అంతరాయాలు వంటివి సహా ఈ ప్రాంతంతోపాటు విస్తృత ప్రపంచంపై తీవ్ర పరిణామాల భారాన్ని వారు గుర్తుచేశారుఈ ఏడాది ఏప్రిల్‌ 8నాటి కాల్పులు విరమణను స్వాగతిస్తూ–  ఉద్రిక్తతల ఉపశమనంలో సంప్రదింపులుదౌత్యం ప్రాధాన్యాన్ని ప్రధానమంత్రులు ఇద్దరూ స్పష్టం చేశారుపశ్చిమాసియాలో శాశ్వత శాంతి త్వరలోనే నెలకొనగలదని ఆశాభావం వ్యక్తం చేశారుహోర్ముజ్ జలసంధి మీదుగా నౌకాయాన స్వేచ్ఛప్రపంచ వాణిజ్య కార్యకలాపాలను కొనసాగించాలని పిలుపునిచ్చారుఅదే సమయంలో నిర్బంధ కాండకు ఎంతమాత్రం పాల్పడరాదని పేర్కొంటూ– ఉద్రిక్తతల ఉపశమనం దిశగా కృషికికార్యక్రమాలకు పూర్తి మద్దతును పునరుద్ఘాటించారు.

ఆర్థిక సహకారం.. వాణిజ్యంపెట్టుబడులు

సుస్థిరతఆవిష్కరణలుదీర్ఘకాలిక వృద్ధి వంటి ఉమ్మడి ప్రాథమ్యాల ప్రాతిపదికగా సాగే నెదర్లాండ్స్భారత ఆర్థిక భాగస్వామ్యం ఉభయదేశాల పరస్పర సౌభాగ్యానికి తోడ్పడుతూ  సహకారానికి ఆదర్శంగా నిలుస్తున్నదని నాయకులిద్దరూ పేర్కొన్నారుసమర్థ సరఫరా వ్యవస్థలుస్వేచ్ఛా విపణులపై సంయుక్త నిబద్ధతతో ద్వైపాక్షిక వాణిజ్యంలో వృద్ధిని వారు స్వాగతించారునెదర్లాండ్స్ తన అంతర్జాతీయ స్థాయి సదుపాయాల నెట్‌వర్క్‌… ముఖ్యంగా రోటర్‌డామ్ ఓడరేవు ద్వారా భారత ఎగుమతిదారులకు ఐరోపాను ఒక వ్యూహాత్మక ముఖద్వారంగా నిలిపిందని పేర్కొన్నారుమరోవైపు డచ్ కంపెనీలకు సువిశాలచైతన్యవంతమైన మార్కెట్‌ను భారత్‌ సమకూరుస్తున్నదని తెలిపారునెదర్లాండ్స్‌ కంపెనీలు తమ వ్యాపారాన్ని విస్తరించుకునే అవకాశాలువాణిజ్య సౌలభ్యం సహా భారత్‌లో విస్తృతనిపుణప్రతిభావంతులైన యువ సమూహం ద్వారా గణనీయ ప్రయోజనం పొందగలవని భారత ప్రధానమంత్రి తెలిపారుఅలాగేభారతీయ వ్యాపారాలు… ముఖ్యంగా జల నిర్వహణసుస్థిర వ్యవసాయంస్మార్ట్ సిటీల రంగాల్లో డచ్ సహచారుల ఉన్నత నైపుణ్యాన్ని సద్వినియోగం చేసుకోవచ్చున్నారు.

రెండు దేశాల మధ్య ప్రస్తుత ఆర్థిక సహకారంపై సంతృప్తి వ్యక్తం చేస్తూ– భారత్ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం వల్ల లభించగల అవకాశాల దృష్ట్యా మరింత వృద్ధికి అంతులేని అవకాశాలు ఉన్నాయని నాయకులు స్పష్టం చేశారుభారత్‌కు ప్రధాన వాణిజ్యపెట్టుబడి భాగస్వాములలో ఒకటిగా నెదర్లాండ్స్ కొనసాగుతుండటం ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాల గాఢతపునరుత్థాన సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తోందని పేర్కొన్నారు.

వాణిజ్యంపెట్టుబడులను మరింత సరళం చేసే దిశగా రెండు దేశాల కస్టమ్స్ అధికారుల మధ్య సమాచార ఆదానప్రదానానికి వీలు కల్పిస్తూకస్టమ్స్ వ్యవహారాలలో పరస్పర పాలన తోడ్పాటు ఒప్పందంపై సంతకాలు చేయడాన్ని ప్రధానమంత్రులు స్వాగతించారుతద్వారా ఇది కస్టమ్స్ లావాదేవీల అమలును మెరుగుపరస్తూ భారత్‌నెదర్లాండ్స్ మధ్య చట్టబద్ధ వాణిజ్య సౌలభ్యం కల్పిస్తుందని తెలిపారు.

భారత్నెదర్లాండ్స్ సంయుక్త వాణిజ్యపెట్టుబడుల కమిటీఫాస్ట్ ట్రాక్ మెకానిజం వంటి వాటి ద్వారా ద్వైపాక్షిక వాణిజ్యపెట్టుబడులను మరింత విస్తరించడంపై నిబద్ధతను వారిద్దరూ పునరుద్ఘాటించారుసుస్థిర వృద్ధిఉద్యోగ కల్పనపునరుత్థాన విలువ వ్యవస్థలకు మద్దతుగా పెట్టుబడి సదుపాయాల మెరుగుదలఆవిష్కరణావరణ వ్యవస్థల బలోపేతంపై దృష్టి సారించాల్సిన అవసరాన్ని వారిద్దరూ అంగీకరించారు.

అంకుర సంస్థలుఆవిష్కరణల రంగంలో సహకారానికి బలమైన అవకాశాలు ఉన్నాయని ప్రధానమంత్రులు స్పష్టం చేశారురెండు దేశాల్లో రూపొందించిన వివిధ మార్గాలు భారతఐరోపా సమాఖ్య విపణులు సహా ప్రపంచమంతటా విస్తరించగలవని పేర్కొన్నారురెండు దేశాల అంకుర వ్యవస్థల పటిష్ఠ అనుసంధానానికిఆదానప్రదానాల సౌలభ్య కల్పనకు డిజిటల్ సాఫ్ట్ల్యాండింగ్ కార్యక్రమాల అన్వేషణకుఅలాగే వాణిజ్యఆవిష్కరణల కార్యక్రమాలుసాంకేతిక సదస్సులలో భాగస్వామ్యం పెంచుకోవడానికి వారు అంగీకరించారు.

రక్షణభద్రత రంగాల్లో సహకారం

రక్షణ సహకారంపై ఆసక్తి వ్యక్తీకరణ పత్రంపై సంతకాలు పూర్తికావడాన్ని వారు స్వాగతించారురెండు దేశాల మధ్య రక్షణ సహకారం మరింత విస్తరించాల్సిన అవసరాన్ని స్పష్టం చేశారుఇందులో భాగంగా రక్షణ మంత్రిత్వ శాఖల మధ్య నిరంతర సంప్రదింపులుసిబ్బంది స్థాయి చర్చలతోపాటు సమాచార ఆదానప్రదానంపర్యటనలుపరిశోధనఆవిష్కరణలుశిక్షణ కార్యక్రమాల సమన్వయం చేపట్టడంపై అంగీకరించారుపరస్పర రక్షణ పారిశ్రామిక సహకారం పరిధి విస్తృతి దిశగానూ ముందుకు సాగాల్సి ఉందని వారు అంగీకరించారు.

రక్షణ రంగంలో ఐరోపా సమాఖ్య యంత్రాంగాల పరిధిలోనూఇతర భాగస్వాములతో సంయుక్తంగా సహకారాన్ని పెంచుకోవాలని నిర్ణయించుకున్నారుఉభయ దేశాల సాయుధ దళాలు అవసరాలు తీర్చే దిశగ రక్షణ పరికరాలువ్యవస్థలువిడిభాగాలుఇతర కీలక సామర్థ్యాల రూపకల్పనకు అవసరమైన రక్షణ పారిశ్రామిక సహకారాన్ని నిర్దేశించే ప్రణాళిక రూపకల్పన అవకాశాలను అన్వేషించాలని నిశ్చయించారుసంయుక్త రూపకల్పనసాంకేతిక పరిజ్ఞాన బదిలీఉత్పదాన కోసం ఉమ్మడి సంస్థల ఏర్పాటు వంటివి ఇందులో భాంగా ఉంటాయి.

రక్షణసముద్ర భద్రతఆర్థిక భద్రతకీలకఆధునిక సాంకేతికతలుసైబర్ భద్రతఉగ్రవాద నిరోధంపరస్పరం అంగీకరించిన ఇతర అంతర్జాతీయ భద్రతాంశాలు సహా సంప్రదాయసంప్రదాయేతర భద్రత సమస్యలపై జాతీయ భద్రత యంత్రాంగాల మధ్య క్రమం తప్పని ఆదానప్రదానం ద్వారా భద్రత సహకారం పెంచుకోవడానికి నాయకులు అంగీకరించారు.

సార్వత్రికస్వేచ్ఛాయుతసురక్షిత సైబర్‌ రంగం దిశగా సహకార బలోపేతం దిశగా వార్షిక ద్వైపాక్షిక సైబర్ సంప్రదింపులపై నాయకులిద్దరూ సంతృప్తి వ్యక్తం చేశారుదీంతోపాటు ఆన్‌లైన్ సైబర్ స్కూల్ 8వ సమావేశం నిర్వహణను ప్రశంసించారుఈ నేపథ్యంలో బహుపాక్షిక వేదికలపై మరింత సన్నిహిత సమన్వయంసామర్థ్య వికాసంజ్ఞాన ఆదానప్రదానం ద్వారా సైబర్ ముప్పులునేరాల నిరోధానికి సంయుక్త కృషి సహా సైబర్‌ రంగంలో సహకారం పెంపు దిశగా ఆసక్తి వ్యక్తీకరణ ప్రకటనపై సంతకం చేయడాన్ని నాయకులు స్వాగతించారు.

సార్వత్రికస్వేచ్ఛాయుతసురక్షితసుస్థిరసౌలభ్యశాంతియుత ఐసీటీ వాతావరణం ఏర్పడాల్సిన ఆవశ్యకతను వారిద్దరూ స్పష్టం చేశారుపరిశోధనలకునవ్యావిష్కరణలకుఆర్థిక వృద్ధికి ఇదొక ఉపకరణం కాగలదని పేర్కొన్నారుదీనికి సంబంధించి 2026 ఫిబ్రవరి 19న న్యూఢిల్లీలో నిర్వహించిన ‘ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌’లో పాల్గొనడంపై ప్రధానమంత్రి మోదీ నెదర్లాండ్స్‌కు ధన్యవాదాలు తెలిపారు.

భారత్‌లోని జమ్మూకాశ్మీర్‌లోగల పహల్గామ్‌లో 2025 ఏప్రిల్‌ నాటి ఉగ్రవాదుల మారణకాండను అమానుషహేయమైన దాడిగా ప్రధానమంత్రి రాబ్‌ జెటెన్‌ ఖండించారుసరిహద్దు ఉగ్రవాదంసహా ఉగ్రవాద నిర్మూలన కోసం భారత్‌ చేస్తున్న కృషికి నెదర్లాండ్స్ సంఘీభావంప్రగాఢ మద్దతును తెలిపిందిఈ ఊచకోతకు సూత్రధారులను ఇందుకు బాధ్యులను చేయాలని నాయకులిద్దరూ పిలుపునిచ్చారుఅన్ని రూపాలువ్యక్తీకరణలలోగల ఉగ్రవాదాన్ని ప్రధానమంత్రులు నిస్సంశయంగా ఖండించారుఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపే వైఖరిని అనుసరించాలనిఉగ్రవాద నిరోధంలో ద్వంద్వ ప్రమాణాలు ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు.

ఐక్యరాజ్యసమితిఎఫ్‌ఏటీఎఫ్‌ సహా ద్వైపాక్షికబహుపాక్షిక యంత్రాంగాల ద్వారా ఉగ్రవాదాన్ని నిరంతరంసమగ్రంగా ఎదుర్కోవాల్సిన అవసరాన్ని నాయకులిద్దరూ పునరుద్ఘాటించారుఐక్యరాజ్యసమితి భద్రత మండలి తీర్మానం-1267లో ఆంక్షల కమిటీ నిషేధించిన సమూహాలతోపాటు ఉగ్రవాదులువాటి బృందాలన్నిటిపైనే కాకుండా వారి ప్రతినిధులుఅనుబంధ సంస్థలుప్రాయోజితులుమద్దతుదారులుఆర్థిక చేయూతనిచ్చే శక్తులపై సమన్వయంతో చర్యలు చేపట్టాలని ప్రపంచ దేశాలకు వారు పిలుపునిచ్చారుఉగ్రవాద సురక్షిత స్థావరాలుమౌలిక సదుపాయాల నిర్మూలనతోపాటు ఉగ్రవాద నెట్‌వర్కులనువాటి ఆర్థిక వనరులను నిరోధిస్తూఅంతర్జాతీయ చట్టానికి అనుగుణంగా ఉగ్రవాద సూత్రధారులను సత్వరం న్యాయస్థానం ఎదుట నిలబెట్టడంలో అన్ని దేశాలు తమ వంతు కృషి చేయాలని కోరారుఅంతర్జాతీయ ఉగ్రవాదంపై ఐక్యరాజ్యసమితి సమగ్ర ఒడంబడిక దిశగా భారత్‌ కృషికి ప్రధానమంత్రి రాబ్‌ జెటెన్‌ మద్దతు ప్రకటించారు.

మానవరహిత విమాన వ్యవస్థల వంటి వినూత్నఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలను ఉగ్రవాద దుశ్చర్యల కోసం ఉపయోగించడంఉగ్రవాదులుఉగ్రవాద సంస్థలు వర్చువల్ ఉపకరణాలను వినియోగిస్తుండటంఉగ్రవాద భావజాల వ్యాప్తికి సమాచారప్రసార సాంకేతిక పరిజ్ఞానాల దుర్వినియోగం తదితరాలతో ముప్పు పెరుగుతుండటంపై నాయకులిద్దరూ ఆందోళన వ్యక్తం చేశారు.

ఉగ్రవాదంపై పోరాటం సహా ఈ అంశాల్లో ప్రపంచ సహకారం దిశగా సంబంధిత చట్రాన్ని బలోపేతం చేయడంపై ఉమ్మడి నిబద్ధతను వారిద్దరూ అంగీకరించారుఇందులో భాగంగా మనీలాండరింగ్ నిరోధం సహా ఉగ్రవాదానికి నిధుల సమకూర్చడాన్ని నిలువరించడంలోనూ అన్ని దేశాలూ అంతర్జాతీయ ప్రమాణాలను అనుసరించాల్సిన అవసరాన్ని వారిద్దరూ స్పష్టం చేశారు.

ఆధునిక సాంకేతికతలు.. ఆవిష్కరణలు.. విజ్ఞానం.. విద్య

సెమీకండక్టర్లుసంబంధిత ఆధునిక సాంకేతికతపై భాగస్వామ్యం దిశగా అవగాహన ఒప్పందంపై వారిద్దరూ హర్షం వ్యక్తం చేశారుపెట్టుబడులుపరిశోధనప్రతిభ ఆదానప్రదానం వంటివి సహా సెమీకండక్టర్ల రంగంలో సహకారాన్ని మరింత పెంచేందుకు ఈ ఒప్పందం ఒక చట్రాన్ని సమకూరుస్తుంది.

విజ్ఞానంసాంకేతికతఆవిష్కరణలపై సంయుక్త కార్యాచరణ బృందం ఇప్పటికే చురుగ్గా వ్యవహరిస్తుండటంపై వారు సంతృప్తి వ్యక్తం చేశారుదీనిద్వారా ప్రభుత్వప్రైవేట్ భాగస్వామ్యాల ఏర్పాటుప్రభుత్వాలువ్యాపారాలువిజ్ఞాన సంస్థ నైపుణ్యానుసంధానంపై దృష్టి సారించడాన్ని ప్రశంసించారుఅలాగేవిజ్ఞానంసాంకేతికతఆవిష్కరణల రంగంలో కొనసాగుతున్న సహకారంపై హర్షం వెలిబుచ్చారుసంయుక్త పరిశోధనఅభివృద్ధి ప్రాజెక్టులుప్రతిభసాంకేతిక పరిజ్ఞాన బదిలీకి క్రమం తప్పని ద్వైపాక్షిక చర్చల ద్వారా ఈ బృందం మార్గం సుగమం చేస్తుందిఈ మేరకు కొన్నేళ్ల నుంచీ సంయుక్తంగా ప్రారంభించిన దాదాపు 50 పెద్ద పరిశోధనఆవిష్కరణ కార్యక్రమాలను ప్రధానమంత్రులు ఇద్దరూ గుర్తుచేసుకున్నారుఉమ్మడి సామాజిక సవాళ్లను భాగస్వామ్య పరిష్కారాలతో ఎదుర్కోవడమే లక్ష్యంగా కీలక సహాయక సాంకేతికతల రంగంలో నిరంతర సహకారానికి ప్రాధాన్యం పెరుగుతున్నదని వారు అంగీకరించారు.

సహకారంసాంకేతికతప్రతిభా వికాసం ద్వారా సెమీకండక్టర్ రంగానికి.. ముఖ్యంగా పరిశ్రమలుఅంకుర సంస్థలుఉన్నతీకరణలుచిన్నమధ్య తరహా పరిశ్రమలువాటి సరఫరాదారులకు మద్దతునిస్తూ– వాటిని బలోపేతం చేసే లక్ష్యంతో ఇండియన్ సెమీకండక్టర్ మిషన్డచ్ సెమీకండక్టర్ కాంపిటెన్స్ సెంటర్‌ల అనుసంధాన చొరవను వారిద్దరూ స్వాగతించారుదీంతోపాటు ఇండోడచ్ సెమీకండక్టర్ ఆన్‌లైన్ స్కూల్‌నుదాని తదుపరి దశ కొనసాగింపును అభినందించారు.

సెమీకండక్టర్లుసంబంధిత సాంకేతికతలలో ‘ఎన్‌ఎక్స్‌పీఏఎల్‌ఎంఎల్‌టాటాసీజీ సెమియా వంటి పారిశ్రామిక సంస్థల భాగస్వామ్యంతో మేధా మథన వారధి రూపకల్పనను వారు ప్రశంసించారుఈ దిశగా ఐండ్‌హోవెన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీయూనివర్సిటీ ఆఫ్ ట్వెంటే సహా ప్రముఖ భారతీయ సాంకేతిక సంస్థల (ఐఐఎస్‌సీబెంగళూరు సహా బాంబేఢిల్లీగాంధీనగర్గువహటిమద్రాస్ ఐఐటీలమధ్య సహకార ఒప్పందం కుదరడాన్ని స్వాగతించారురెండువైపులా విద్యాపారిశ్రామిక రంగాల భాగస్వామ్యంతో పరిశోధనఅభివృద్ధితోపాటు ప్రతిభా వికాసానికి ఇది ఉత్తేజమిస్తుందని పేర్కొన్నారు.

నిరంతర ఆవిష్కరణలలో కీలక ఖనిజాల వ్యూహాత్మక ప్రాధాన్యంతోపాటు పటిష్ఠసుస్థిర  సరఫరా వ్యవస్థల రూపకల్పనలో ప్రపంచ సహకారం అవసరాన్ని వారిద్దరూ స్పష్టం చేశారుఅన్వేషణపరిశోధనఆవిష్కరణవిలువ వ్యవస్థల ఏకీకరణసరఫరా వ్యవస్థ పటిష్టీకరణవర్తుల ఆర్థిక వ్యవస్థఈఎస్‌జీ ప్రమాణాలుసంబంధిత అంచనాలు సహా కీలక ఖనిజాల విలువ వ్యవస్థలన్నిటా సహకార బలోపేతంపై వారిద్దరూ ఆసక్తి వ్యక్తం చేశారుఈ నేపథ్యంలో కీలక ఖనిజాలపై అవగాహన ఒప్పందం కుదరడంపై హర్షం ప్రకటించారు.

రెండు దేశాల ఉన్నత విద్యా సంస్థల విద్యాబోధన ప్రాధాన్యాలుఅవసరాలకు అనుగుణంగా సహకారాన్ని ప్రోత్సహించేందుకుభారతనెదర్లాండ్స్‌ విద్యా మంత్రిత్వ శాఖవిద్యాసంస్కృతిశాస్త్రవిజ్ఞాన మంత్రిత్వ శాఖల మధ్య ఉన్నత విద్యపై అవగాహన ఒప్పందం కుదరడాన్ని నాయకులిద్దరూ స్వాగతించారు.

డచ్భారత విశ్వవిద్యాలయాల మధ్య కొనసాగుతున్న సంస్థాగత సహకారంపై వారు సంతృప్తి వ్యక్తం చేశారుఈ మేరకు గ్రోనింగన్నలంద విశ్వవిద్యాలయాలుడెల్ఫ్ట్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీముంబై మెట్రోపాలిటన్ రీజినల్ డెవలప్‌మెంట్ అథారిటీసర్వే ఆఫ్ ఇండియాఐటీసీట్వెంటే విశ్వవిద్యాలయంవ్రిజే యూనివర్సిటీ ఆమ్‌స్టర్డామ్– ఐఐటీ రూర్కీ తదితర మరెన్నో సంస్థల మధ్య ఇటీవలి సహకార ఒప్పందాలను వారు ఉదాహరించారువిద్యాశాస్త్రవిజ్ఞాన సహకార బలోపేతంలో ఇండోడచ్ ఎడ్యుకేషన్ అండ్‌ అకడమిక్ నెట్‌వర్క్ వంటి వేదికలు కీలక పాత్ర పోషించగలవని వారు పేర్కొన్నారు.

భారత్‌నెదర్లాండ్స్ మధ్య అంతరిక్ష భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే అవకాశాలపై వారిద్దరూ సమాలోచన చేశారుముఖ్యంగా వాతావరణ మార్పుజలవనరుల సమస్యలుఆహార భద్రతవాయు నాణ్యత వంటి సామాజిక సమస్యల పరిష్కారంలో అంతరిక్ష ఆధారిత అనువర్తనాల వినియోగం ఆవశ్యతను వారు స్పష్టం చేశారు.

ఇంధన భద్రత.. మార్పిడి.. వర్తుల ఆర్థిక వ్యవస్థ

జీవ ఇంధనాలురసాయనాల రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని ప్రస్తావిస్తూ– జి20కి భారత్‌ అధ్యక్షత సమయంలో ప్రారంభించిన ‘గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్‌’లో నెదర్లాండ్స్ చేరడంపై ప్రధానమంత్రి మోదీ హర్షం ప్రకటించారుఈ సందర్భంగా జీవఆర్థిక వ్యవస్థపై కృషి చేసేందుకు ప్రధానమంత్రులు ఇద్దరూ నిబద్ధతను పునరుద్ఘాటించారుమరోవైపు ‘మిషన్ ఇన్నోవేషన్ ఆన్‌ బయోరిఫైనరీస్‌’ కార్యక్రమం రెండు దేశాలు సంయుక్త అధ్యక్షతన విజయవంతం కావడంపై సమీక్షించారు.

వ్యర్థం నుంచి అర్థం’పై ద్వైపాక్షిక సహకారాన్ని గుర్తిస్తూడచ్ జాతీయ వర్తుల ఆర్థిక వ్యవస్థ కార్యక్రమం 2023-2030కి సంబంధించి 2025నాటి నవీకరణవరల్డ్ సర్క్యులర్ ఎకానమీ ఫోరమ్-2026కు భారత్‌ అధ్యక్షత వహించడం వంటివి మరిన్ని కొత్త రంగాల్లో భాగస్వామ్య విస్తరణకు అవకాశాన్నిస్తాయని నాయకులు పేర్కొన్నారుపారిశ్రామిక వర్తుల ఆర్థిక వ్యవస్థప్రయోగాత్మకవిస్తరణానుకూల ప్రాజెక్టులలో సాంకేతిక పరిజ్ఞాన వినియోగంనవ్యావిష్కరణలు తేవడంవాణిజ్యపెట్టుబడుల రంగంలో అవకాశాల కల్పన అవసరాన్ని స్పష్టం చేశారుసుస్థిరవాతావరణ మార్పులను తట్టుకోగల పట్టణ వ్యవస్థల కోసం ఘనద్రవ వ్యర్థాల నిర్వహణ వంటివి కూడా ఇందులో భాగంగా ఉంటాయిఉదాహరణకు… ‘రిసోర్స్ ఎఫిషియెన్సీ అండ్ సర్క్యులర్ ఎకానమీ ఇండస్ట్రీ కోయలిషన్’లో చేరడానికి డచ్ కంపెనీలను ఆహ్వానించిన బీ2బీ భాగస్వామ్యాలతో ఇది సాధ్యం కాగలదుసుస్థిర రవాణా రంగంలో అత్యాధునికపరస్పర పూరక ఛార్జింగ్ మౌలిక సదుపాయాలుబ్యాటరీ సాంకేతికతవ్యవస్థల ఏకీకరణప్రామాణీకరణసార్వత్రిక విధివిధానాలుభారీమధ్యస్థభారీ శూన్య ఉద్గార వాహనాలుఆధునిక పట్టణ రవాణా వ్యవస్థలుబహుళరవాణా మార్గాల ఏకీకరణప్రత్యామ్నాయ ఇంధనాలుక్రియాశీల రవాణా వంటి రంగాల్లోనూ సహకారాన్ని మరింతగా విస్తరించవచ్చునని పేర్కొన్నారు.

పునరుత్పాదక ఇంధన రంగంలో భారత్‌– నెదర్లాండ్స్ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తూ పునరుత్పాదక ఇంధనంపై అవగాహన ఒప్పందం కింద ఒక సంయుక్త కార్యవర్గం ఏర్పాటును రెండు దేశాల నాయకులూ స్వాగతించారుఇంధన మార్పడిని సరళం చేయడంలో వినూత్న సౌరశక్తిగ్రీన్ హైడ్రోజన్నిల్వపునరుత్పాదక ఇంధన రంగంలో పెట్టుబడులు సహా పునరుత్పాదక ఇంధన సహకారంపై విస్తృత కార్యక్రమానికి ఈ ఒప్పందం వెసులుబాటు కల్పిస్తుంది.

పునరుత్పాదక ఇంధనంపై సహకారంతోపాటు ఉభయపక్షాల పెట్టుబడుల బలోపేతం సహా గ్రీన్‌ హైడ్రోజన్ రూపకల్పనపై ప్రతిష్టాత్మక భారత్నెదర్లాండ్స్ భవిష్యత్‌ ప్రణాళికను రెండు దేశాల ప్రధానమంత్రులు సంయుక్తంగా ఆవిష్కరించారుగ్రీన్‌ హైడ్రోజన్ ఉత్పత్తివినియోగంఎగుమతికి సంబంధించి భారత్‌ ఆకాంక్షలుఅపార సామర్థ్యంతోపాటు పోటీతత్వ ప్రయోజనాల పరంగా ఈ ప్రణాళిక ఎనలేని మద్దతిస్తుందని వారు పేర్కొన్నారుదీంతోపాటు రెండు దేశాల్లో గ్రీన్‌ హైడ్రోజన్‌ను ఒక సుస్థిర ఇంధన వనరుగా ప్రజానీకం సత్వరం అంగీకరించడంలో ఇది దోహదం చేస్తుందని తెలిపారు.

మరోవైపు ఇంధన మార్పిడి సామర్థ్య వికాసంపై నీతి ఆయోగ్నెదర్లాండ్స్ మధ్య ఉమ్మడి లక్ష్యం ప్రకటన పునరుద్ధరణతో ఇంధన భద్రతమార్పిడి రంగాల్లో నిరంతర సహకారానికి భరోసా లభిస్తుంది.

విద్యారంగంలో సహకార బలోపేతం లక్ష్యంగా గ్రోనింగన్ విశ్వవిద్యాలయంభారత్‌లోని 19 ఐఐటీల మధ్య అవగాహన ఒప్పందం కుదరడంపై ప్రధానమంత్రులిద్దరూ హర్షం వ్యక్తం చేశారుహైడ్రోజన్‌పై పీహెచ్‌డీ ఫెలోషిప్ కోర్సు ప్రారంభం దిశగా భారత శాస్త్రసాంకేతిక మంత్రిత్వశాఖగ్రోనింగన్‌ విశ్వవిద్యాలయం మధ్య ఒప్పందాన్ని కూడా వారు స్వాగతించారు.

నీటి నిర్వహణ
భారత నీటి సంబంధిత అవసరాలు… నెదర్లాండ్స్ నైపుణ్యాలుఅనుభవం మధ్య సమన్వయాన్ని పెంపొందించడం లక్ష్యంగా నీటి విషయంలో వ్యూహాత్మక భాగస్వామ్యం కింద సాధించిన పురోగతిని ఇరువురు నేతలు గుర్తించారునమామి గంగే మిషన్‌లో భాగస్వామ్యం ‘నీటిని ఒక సాధనంగా‘ ఉపయోగించడం సహా పట్టణ నదీ నిర్వహణ ప్రణాళికల ద్వారా వాతావరణ మార్పులను తట్టుకునేందుకు పట్టణ నీటి నిర్వహణడెల్టా నిర్వహణనీటి నాణ్యత నిర్వహణమురుగునీటి పునర్వినియోగంనూతన నీటి సాంకేతిక పరిజ్ఞానాల పరిచయం వంటి రంగాల్లో జరుగుతున్న ఉమ్మడి ప్రయత్నాలను ఇరువురు ప్రధానమంత్రులు అభినందించారుసురక్షిత పారిశుధ్య నిర్వహణఅందరికీ స్వచ్ఛమైన నీరు అందుబాటులో ఉంచడం వంటి లక్ష్యాల ప్రాముఖ్యతను ఇరువురు నేతలూ ప్రధానంగా ప్రస్తావించారుభారత స్వచ్ఛ్ భారత్ మిషన్ లక్ష్యాలకు అనుగుణంగా…. అంతర్జాతీయంగా వాష్ (డబ్ల్యూఏఎస్‌హెచ్సంబంధిత అభివృద్ధి ప్రాజెక్టులకు సుస్థిర ఆర్థిక సాయం అందించడంలో నెదర్లాండ్స్ కృషిని వారు గుర్తించారు.
భారత ప్రభుత్వ జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నెదర్లాండ్స్ ప్రభుత్వ మౌలిక సదుపాయాలుజల నిర్వహణ మంత్రిత్వ శాఖ సహకారంతో… ఢిల్లీలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఫర్ టెక్నాలజీ (ఐఐటీ)లో జల రంగం కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటును ఇరువురు నేతలు స్వాగతించారుఉత్తరప్రదేశ్మహారాష్ట్రపశ్చిమ బెంగాల్తమిళనాడుకేరళం రాష్ట్రాల్లో కొనసాగుతున్న వివిధ ఉమ్మడి కార్యక్రమాల కింద సాధించిన పురోగతినీ వారు గుర్తించారు.
గుజరాత్‌లోని కల్పసర్ ప్రాజెక్టుపై సహకారాన్ని మరింత పెంపొందించుకోవడానికి ఇరువురు నేతలు అంగీకరించారుఈ ప్రాజెక్టులో డచ్ ప్రజల నైపుణ్యంసాంకేతిక సహాయం… నీటి విషయంలో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయగలవని వారు అభిప్రాయపడ్డారు.

భారత్ నేతృత్వంలోని గ్లోబల్ కోయలిషన్ ఫర్ డిజాస్టర్ రెసిలియంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (సీడీఈఆర్ఐకింద పట్టణ నీటి మౌలిక సదుపాయాల సామర్థ్యాల కార్యక్రమంలో ఇప్పటివరకు సాధించిన పురోగతిని ఇరువురు దేశాధినేతలు చర్చించారుఈ కార్యక్రమ సభ్యత్వంలో భాగంగా నెదర్లాండ్స్ తన నైపుణ్యాన్ని పంచుకుంటోందిఅభివృద్ధి చేసిన ఈ శిక్షణా కార్యక్రమాన్ని జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ (ఎన్‌డీఎమ్ఏ)తో కలిసి భారత నగరాల్లో… ప్రపంచవ్యాప్తంగా 50కి పైగా ఇతర సీడీఆర్ఐ సభ్య దేశాల్లోనూ అమలు చేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు ఇరువురు నాయకులు తెలిపారు.
నౌకా వాణిజ్య అభివృద్ధి
ఇటీవల పునరుద్ధరించిన నౌకా వాణిజ్య సహకారంపై అవగాహన ఒప్పందాన్ని ఇద్దరు ప్రధానమంత్రులు అధికారికంగా ధ్రువీకరించారుఅక్టోబర్ 2025లో సంతకం చేసిన ఉద్దేశ పత్రంలో పేర్కొన్న విధంగా భారత్నెదర్లాండ్స్ మధ్య వ్యూహాత్మక హరితడిజిటల్ సముద్ర కారిడార్‘ అభివృద్ధికి మద్దతునిస్తూసురక్షితమైనభద్రమైనసుస్థిరమైన నౌకా వాణిజ్య రంగం కోసం నిరంతర సహకారం ప్రాముఖ్యతను స్పష్టం చేశారుఓడరేవులుఅంతర్గత జలమార్గాల స్మార్ట్సుస్థిర అభివృద్ధి సరుకు రవాణా వ్యయాలను తగ్గిస్తూనే వినియోగదారులకు వేగవంతమైనవిశ్వసనీయ సేవలనందించడం… హరిత ఓడరేవులునౌకాయానం రంగాల్లో తమ భాగస్వామ్యాన్ని మరింతగా పెంపొందించడంవిస్తరించడానికి వారు అంగీకరించారుతదుపరి దశగాభారత్నెదర్లాండ్స్ మధ్య పర్యావరణపరంగా సుస్థిరమైనడిజిటల్‌ అనుసంధానితమైనఆర్థికంగా సమర్థమైనభవిష్యత్ కోసం సిద్ధమైన సముద్ర కారిడార్ దిశగా పనిచేయడం లక్ష్యంగా హరితడిజిటల్ సముద్ర కారిడార్‌పై సమగ్ర వ్యూహాత్మక రోడ్‌మ్యాప్ను అభివృద్ధి చేసే అవకాశాలను అన్వేషించడానికి ఇద్దరు ప్రధానమంత్రులు అంగీకరించారు.

ప్రపంచప్రాంతీయ నౌకా వాణిజ్య భద్రతలో ముఖ్యంగా ఇండోపసిఫిక్ ప్రాంతంలో పరస్పర ప్రయోజనాల దృష్ట్యా ఓడరేవులుఅంతర్గత జలమార్గాల్లో సైబర్ సామర్థ్యాలు సహా కీలక మౌలిక సదుపాయాలను పరిరక్షించడం విభిన్నసమర్థమైన సరుకు రవాణా వ్యవస్థలను (కీలక ముడి పదార్థాలుమందులుఆహారంతో సహాప్రోత్సహించడం వంటి రంగాల్లో సంబంధిత ప్రభుత్వ సంస్థలువ్యాపార సంస్థలువిజ్ఞాన సంస్థల మధ్య అత్యుత్తమ పద్ధతులను పరస్పరం పంచుకోవడానికి ఇరువురు ప్రధానమంత్రులు అంగీకరించారు.
ఆరోగ్య రంగం
ఆరోగ్య రంగంలో ముఖ్యంగా అంటువ్యాధులుయాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ వంటి ప్రపంచ ప్రజారోగ్య ప్రమాదాలనుపెరుగుతున్న అసంక్రమిత వ్యాధుల ప్రభావాన్ని పరిష్కరించడంలో ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించుకోవాల్సిన ప్రాముఖ్యతను ఇరువురు నేతలు ప్రధానంగా ప్రస్తావించారుడిజిటల్ హెల్త్ (ఏఐసైబర్‌ సెక్యూరిటీ సహా), సామర్థ్యాన్ని పెంపొందించే కార్యక్రమాల్లో మరింత సహకారాన్ని ప్రోత్సహించడానికీ వారు అంగీకరించారుఆరోగ్య సంరక్షణప్రజారోగ్యంపై అవగాహన ఒప్పందాన్ని పునరుద్ధరించడాన్ని… మహిళల ఆరోగ్యంవాతావరణపరిరక్షణ సంసిద్ధత కోసం సామర్థ్యాలను పెంపొందించడం… ఇరు దేశాల్లో సుస్థిర ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలపై జ్ఞానాన్ని పంచుకోవడం వంటి రంగాల్లో కొత్త సహకార కార్యక్రమాలను పరిగణనలోకి తీసుకోవడాన్ని ఇరువురు ప్రధానమంత్రులు స్వాగతించారుఈ పునరుద్ధరించిన అవగాహన ఒప్పందం నేపథ్యంలో… అంటువ్యాధులువెక్టర్జనిత వ్యాధులువన్ హెల్త్వ్యాధిపై నిఘా వంటి రంగాలపై ప్రధానంగా దృష్టి సారిస్తూ డచ్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ పబ్లిక్ హెల్త్ అండ్ ది ఎన్విరాన్‌మెంట్ (ఆర్ఐవీఎమ్)ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎమ్ఆర్మధ్య ఇటీవల సంతకం చేసిన లెటర్ ఆఫ్ ఇంటెంట్‌నూ ఇరువురు నాయకులు స్వాగతించారు.
భారత్నెదర్లాండ్స్ వ్యూహాత్మక భాగస్వామ్యం ద్వారా నాణ్యమైనఅందుబాటులో ఉండేసురక్షితమైనసుస్థిరమైన ఆరోగ్య సంరక్షణను అందించడం కోసం ఔషధాలువైద్య పరికరాల రంగాల్లో సహకారానికి మరింత ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ఇద్దరు ప్రధానమంత్రులు స్పష్టం చేశారు2026లోకొత్తగా కుదిరిన అవగాహన ఒప్పందం కింద మొదటి సంయుక్త కార్యవర్గ సమావేశం నిర్వహిస్తారుఈ సమావేశంలో అవగాహన ఒప్పందందాని కార్యాచరణ ప్రణాళిక అమలుమరింత అభివృద్ధిపై చర్చించడంతో పాటుగా విద్యా సంబంధ సహకారంనియంత్రణ సంబంధ సహకారంవ్యాపార భాగస్వామ్యంమార్కెట్ అనుమతులకు గల అవకాశాలపై సమాచారాన్ని పంచుకోవడం వంటి కీలక సహకార అవకాశాలను గుర్తిస్తారు.
వ్యవసాయంఆహార వ్యవస్థలు
వ్యవసాయంఆహార వ్యవస్థలుబాధ్యతాయుతమైన వ్యాపార నిర్వహణ రంగాల్లో ముఖ్యంగా వ్యవసాయంపై సంయుక్త కార్యవర్గం ద్వారా సమాచారాన్నిఅనుభవాలను పంచుకోవడంతో పాటు భారత్నెదర్లాండ్స్ సహకారం కొనసాగుతున్న తీరు పట్ల ఇరువురు నేతలు సంతృప్తి వ్యక్తం చేశారుభారత్‌లో రక్షిత సాగుఆహార శుద్ధిపాడి పశువులుకోళ్ల పెంపకం రంగాల్లో పెరుగుతున్న డచ్ కంపెనీల ఉనికిని నాయకులు స్వాగతించారుఅగ్రిటెక్ సహా వ్యవసాయ రంగానికి సంబంధించి భారత్డచ్ కంపెనీల మధ్య సహకారానికి గల అవకాశాలను సద్వినియోగం చేసుకోవాల్సిన ప్రాముఖ్యతను ఇరువురు నేతలు ప్రధానంగా ప్రస్తావించారు.
డచ్ నిపుణుల నైపుణ్యంతో భారత్‌లోని వ్యవసాయ సంబంధిత రంగాల్లో సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు విషయంలో సాధించిన పురోగతిని ఇరువురు నేతలు సమీక్షించారుఈ కేంద్రాలు అత్యాధునిక గ్రీన్‌హౌస్ వ్యవసాయ ఉత్పత్తిలో సాంకేతికతను ప్రోత్సహించడంతో పాటుచిన్న కమతాల రైతులకు మెరుగైన వ్యవసాయ దిగుబడులనుసామర్థ్యాలను అందిస్తున్నాయిఈ కేంద్రాలు మరింత సుస్థిరమైనఅధిక నాణ్యమైనఅధిక దిగుబడిని పొందడంలో సహాయపడుటతో పాటుగా వ్యవసాయంలో నీటి వినియోగాన్నిరసాయనాల వాడకాన్నీ తగ్గిస్తున్నాయి.
నిరంతర సహకారంసమాచారాన్ని పంచుకోవడం ద్వారా ఈ కేంద్రాల ప్రభావాన్నిసామర్థ్యాన్ని మరింతగా మెరుగుపరచడం పట్ల ఇరువురు ప్రధానమంత్రులు తమ నిబద్ధతను స్పష్టం చేశారుఆహార వ్యవస్థలకు సంబంధించిన వివిధ అంశాల్లోవృత్తి విద్యా రంగంలో విస్తృత సహకారాన్ని అన్వేషించడానికీ వారు అంగీకరించారు.
భారత మత్స్యపశుసంవర్ధకపాడిపరిశ్రమల మంత్రిత్వ శాఖ… నెదర్లాండ్స్ వ్యవసాయమత్స్యఆహార భద్రతపర్యావరణ మంత్రిత్వ శాఖలు ఒక సంయుక్త ప్రకటనపై సంతకం చేయడాన్నీపాడి పరిశ్రమలో శిక్షణ కోసం బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ యానిమల్ హస్బెండ్రీ (సీఈఏహెచ్)లో ఒక ఇండోడచ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ ఏర్పాటునూ ఇరువురు నేతలు స్వాగతించారుఆహార శుద్ధి సహా పాడిఇతర అనుబంధ వ్యవసాయ రంగాల్లో సహకారాన్ని కొనసాగించడానికి ఇరుపక్షాలూ అంగీకరించాయి.

ప్రపంచంతో పోటీపడుతున్న భారత ఉద్యానవన రంగం కోసం… అధిక విలువ కలిగిన ఉద్యానవనపండ్ల పంటలకు సంబంధించి తెగులు రహితమైననాణ్యమైన నారు లభ్యతను ప్రోత్సహించేందుకు… కొనసాగుతున్న భారత క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్‘ కింద క్లీన్ ప్లాంట్ సెంటర్స్‘ (సీపీసీలఏర్పాటు కోసం ఉద్యానవన రంగంలో భారతడచ్ సహకారాన్ని పెంపొందించడానికి జరుగుతున్న కృషిని ఇరువురు ప్రధానమంత్రులు ప్రశంసించారుఈ విషయంగా సామర్థ్యాలను పెంపొందించడంమద్దతునందించండం లక్ష్యంగా నక్తుయిన్‌బౌ… భారత ప్రభుత్వ వ్యవసాయరైతు సంక్షేమ శాఖకు చెందిన జాతీయ ఉద్యానవన బోర్డు మధ్య కుదిరిన  అవగాహన ఒప్పందాన్ని ఇరు దేశాల ప్రధానమంత్రులు స్వాగతించారు.

ఆహార భద్రతరక్షణల ప్రాముఖ్యాన్ని స్పష్టం చేస్తూ… నెదర్లాండ్స్ ఫుడ్ అండ్ కన్స్యూమర్ ప్రొడక్ట్ సేఫ్టీ అథారిటీ (ఎన్‌వీడబ్ల్యూఏ)ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐమధ్య కుదిరిన అవగాహన ఒప్పందాన్ని ఇరువురు నాయకులు స్వాగతించారు.

ప్రజా సంబంధాలుసంస్కృతి

భారత్నెదర్లాండ్స్ సంబంధాలకు మూలస్తంభంగా ఉన్న బలమైన ప్రజా సంబంధాలను ఇద్దరు ప్రధానమంత్రులు గుర్తించారుడచ్ సమాజానికి నెదర్లాండ్స్‌లోని భారతీయ సమాజం చేసిన సేవలకు ప్రధానమంత్రి జెట్టెన్ కృతజ్ఞతలు తెలిపారుముఖ్యంగా యువతవిద్యావేత్తలువృత్తి నిపుణులుక్రీడలుసాంస్కృతిక మార్పిడుల ద్వారా ఇరు దేశాల మధ్య ప్రజల సంబంధాలను మరింత సులభతరం చేయాలనే తమ సంకల్పాన్ని ఇరువురు నేతలు పునరుద్ఘాటించారు.

ఇరు దేశాల మధ్య చట్టబద్ధమైన వలసలురాకపోకలను సులభతరం చేయాల్సిన ప్రాముఖ్యతను గుర్తించిఈ విషయంగా అవగాహన ఒప్పందంపై సంతకం చేయడాన్ని ఇరు దేశాల నేతలు స్వాగతించారు.

అక్రమ వలసలుమానవ అక్రమ రవాణాను నివారించడంఎదుర్కోవడం అత్యంత నైపుణ్యం కలిగిన నిపుణుల చట్టబద్ధమైన రాకపోకలను ప్రోత్సహించడం లక్ష్యంగా సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికీ ఇరు దేశాలు అంగీకరించాయి. వలస కార్మికులను గౌరవ మర్యాదలతో చూసేలా నిర్ధారించే అంతర్జాతీయ ప్రమాణాల ద్వారా ఈ విధానం మార్గనిర్దేశం పొందుతుందిచట్టబద్ధమైన రాకపోకలుపారదర్శక వీసా ప్రక్రియలుకార్మికుల హక్కుల పరిరక్షణ వంటివి ఇందులో భాగంగా ఉన్నాయి.

రూపకల్పనప్రదర్శన కళలుదృశ్య కళలుమ్యూజియంవారసత్వ సహకారం వంటి రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంపొందించేందుకు ప్రదర్శనలుసాంస్కృతిక కార్యక్రమాలను ప్రోత్సహించడం సహా మెరుగైన సాంస్కృతిక సహకారం ద్వారా ఇరు దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలను మరింతగా పెంపొందించుకోవడానికి ఇద్దరు ప్రధానమంత్రులు అంగీకరించారుసాంస్కృతిక సహకారంపై ఒక సంయుక్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేసే అవకాశంపైనా వారు తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

ఇరు దేశాల సంస్కృతిని పరస్పరం గౌరవించుకోవాల్సిన ప్రాముఖ్యతను స్పష్టం చేస్తూ డ్రెంట్స్ మ్యూజియంనేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందంలో భాగంగాడ్రెంట్స్ మ్యూజియంలో అమృత షేర్గిల్ కళాకృతుల ప్రదర్శన ఏర్పాటు ప్రయత్నాలను ఇరు దేశాల ప్రధానమంత్రులు అభినందించారునేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్‌లో వాన్ గోఇతర డచ్ కళాకృతుల ప్రదర్శన కోసం ఎదురుచూస్తున్నట్లు వారు తెలిపారు.

సాంస్కృతిక కళాఖండాల అప్పగింతపునరుద్ధరణ విషయంలో పరస్పర సహకారం ప్రాముఖ్యతనూ ఇద్దరు ప్రధానమంత్రులు స్పష్టం చేశారుఆ విషయంలో లైడెన్ విశ్వవిద్యాలయం నుంచి చోళుల కాలం నాటి తామ్ర పత్రాలను భారత అధికారులకు అప్పగించడాన్ని వారు స్వాగతించారు.

భారత్నెదర్లాండ్స్ మధ్య శతాబ్దాల నాటి ద్వైపాక్షిక నౌకా వాణిజ్య చరిత్రను గుర్తుచేసుకుంటూ… లోథాల్ (గుజరాత్)లోని నేషనల్ మారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ (ఎన్ఎమ్‌హెచ్‌సీఅభివృద్ధిలో సహకారం కోసం భారత ఓడరేవులునౌకాయానంజలమార్గాల మంత్రిత్వ శాఖఆమ్‌స్టర్‌డామ్‌లోని నేషనల్ మారిటైమ్ మ్యూజియం మధ్య కుదిరిన అవగాహన ఒప్పందాన్ని ఇరు దేశాల ప్రధానమంత్రులు స్వాగతించారు.

స్నేహపూర్వకమైనఆత్మీయ వాతావరణంలో జరిగిన ఈ చర్చల సందర్భంగా ద్వైపాక్షిక సంబంధాలను మరింత అభివృద్ధి చేసుకోవడానికిభారత్నెదర్లాండ్స్ వ్యూహాత్మక భాగస్వామ్య రోడ్‌మ్యాప్‌లోని వివిధ రంగాల్లో బహుముఖ సహకారానికి విస్తృత అవకాశాలు ఉన్నాయని ఇరువురు నేతలు విశ్వాసం వ్యక్తం చేశారుతమకు ఆత్మీయ ఆతిథ్యం అందించిన నెదర్లాండ్స్ ప్రధానమంత్రి గౌరవ రాబ్‌ జెటెన్‌కు భారత ప్రధానమంత్రి శ్రీ మోదీ ధన్యవాదాలు తెలిపారుఆ దేశ ప్రధానమంత్రి శ్రీ రాబ్‌ జెటెన్‌ను వీలైనంత త్వరగా భారత్‌ను సందర్శించాలని శ్రీ మోదీ ఆహ్వానించారు.

 

***