Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

నెదర్లాండ్స్ రాజు విల్లెమ్ – అలెగ్జాండర్, రాణి మాక్సిమాలను మర్యాదపూర్వకంగా కలుసుకున్న ప్రధానమంత్రి

నెదర్లాండ్స్ రాజు విల్లెమ్ – అలెగ్జాండర్, రాణి మాక్సిమాలను మర్యాదపూర్వకంగా కలుసుకున్న ప్రధానమంత్రి


ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు హేగ్‌లోని ప్యాలెస్ హౌస్ టెన్ బాష్‌లో నెదర్లాండ్స్ రాజు విల్లెమ్ – అలెగ్జాండర్రాణి మాక్సిమాలను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.

భారతనెదర్లాండ్స్ ప్రజల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడంతో పాటురెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరచడంపై ప్రధానమంత్రి వారితో తమ అభిప్రాయాలను పంచుకున్నారుపరస్పర సుహృద్భావాన్ని పెంపొందించడంలోనూద్వైపాక్షిక సంబంధాలకు సరికొత్త ఉత్తేజాన్ని అందించడంలోనూ ప్రముఖ పాత్ర పోషించిన వారి 2019 నాటి భారత పర్యటనను ప్రధానమంత్రి ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారువిద్యఆవిష్కరణలుసెమీకండక్టర్డిజిటల్నీరుపర్యావరణహిత భాగస్వామ్య రంగాలలో ప్రస్తుతం కొనసాగుతున్న ద్వైపాక్షిక కార్యక్రమాల పట్ల ఇరు దేశాల నాయకులు సంతృప్తిని వ్యక్తం చేశారు.

భారత్ పట్ల వారు చూపిస్తున్న సుహృద్భావాన్ని ప్రధానమంత్రి అభినందించారుతన పర్యటన సందర్భంగా లభించిన ఘన ఆతిథ్యానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారుఈ సందర్భంగా ప్రధానమంత్రి గౌరవార్థం రాజు దంపతులు విందు ఏర్పాటు చేశారు.  

 

***