Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

నార్వే ప్రధానమంత్రితో సంయుక్త పత్రికా ప్రకటన సందర్భంగా భారత ప్రధానమంత్రి పత్రికా ప్రకటన

నార్వే ప్రధానమంత్రితో సంయుక్త పత్రికా ప్రకటన సందర్భంగా భారత ప్రధానమంత్రి పత్రికా ప్రకటన


గౌరవ నార్వే ప్రధానమంత్రి గారూ,

ఇరుదేశాల ప్రతినిధులూ,

మీడియా మిత్రులారా,

నమస్కారం!

నార్వే సందర్శన చాలా ఆనందాన్నిస్తోందిప్రకృతిమానవ పురోగతుల నడుమ సామరస్యానికి అద్భుత ఉదాహరణ ఈ అందమైన దేశం.

ఇంతటి ఆత్మీయానురాగాలతో స్వాగతం పలికిన గౌరవ నార్వే ప్రధానమంత్రికి ముందుగా నా హృదయపూర్వక కృతజ్ఞతలునిన్ననే నార్వే రాజ్యాంగ దినోత్సవం జరిగిందిప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం తరఫున.. బలమైనఉత్తేజకరమైన ప్రజాస్వామ్యదేశమైన నార్వే ప్రజలకు ఈ సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు.

గతేడాదే నేను నార్వేలో పర్యటించాల్సి ఉందిఅయితేపహల్గాంలో ఉగ్రవాద దాడి కారణంగా ఆ పర్యటనను వాయిదా వేయాల్సి వచ్చిందిఆ క్లిష్ట సమయంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్‌కు నార్వే అండగా నిలిచిందిమన స్నేహబంధం శక్తికి ఇది నిదర్శనంఆ మద్దతుసంఘీభావం పట్ల ఈ రోజు నార్వే పర్యటన సందర్భంగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

మిత్రులారా,

అస్థిరతఅనిశ్చితులతో కూడిన కాలం నేడు ప్రపంచంలో సాగుతోందిఉక్రెయిన్ అయినాపశ్చిమాసియా అయినా.. ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో ఘర్షణలు కొనసాగుతున్నాయిఇలాంటి తరుణంలో భారత్ఐరోపా తమ సంబంధాల్లో ఓ సరికొత్త స్వర్ణయుగంలోకి అడుగిడుతున్నాయి.

గతేడాది భారత్ఐరోపా స్వేచ్ఛా వాణిజ్య సంఘంతో ఒక చరిత్రాత్మక వాణిజ్యఆర్థిక భాగస్వామ్య ఒప్పందం అమలైందిభారత్నార్వేల ఉమ్మడి పురోగతిశ్రేయస్సులకు ఒక ఆదర్శవంతమైన నమూనాగా ఈ ఒప్పందం నిలిచిందిఈ ఒప్పందం మేరకువచ్చే పదిహేను సంవత్సరాల్లో దేశంలోకి 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులను తేవడంతోపాటు పది లక్షల ఉద్యోగాలను సృష్టించడం లక్ష్యంఈ ఒప్పందంలోని హామీలను స్పష్టమైన ఫలితాలుగా మలిచే దిశగా ఇరుపక్షాలు నేడు పలు ముఖ్య నిర్ణయాలు తీసుకున్నాయి.

మిత్రులారా,

భారత్ – నార్వే సంబంధాలను హరిత వ్యూహాత్మక భాగస్వామ్యంగా ఈ రోజు మనం రూపుదిద్దుకుంటున్నాంభారత్ విస్తృతివేగంప్రతిభను నార్వే సాంకేతికతమూలధనంతో మేళవించి… శుద్ధ ఇంధనం నుంచి వాతావరణ మార్పులను తట్టుకుని నిలవడం వరకుసముద్ర ఆర్థిక వ్యవస్థ నుంచి పర్యావరణహిత షిప్పింగ్ వరకు వివిధ రంగాల్లో అంతర్జాతీయ మార్గాలను ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం ద్వారా మన కంపెనీలు అభివృద్ధి చేస్తాయి.

మిత్రులారా,

పరిశోధనవిద్యఆవిష్కరణలు కూడా మన సంబంధాలకు బలమైన మూలాధారాలుగా నిలుస్తున్నాయిసుస్థిరతసముద్ర శక్తిభూగర్భ శాస్త్రంఆరోగ్యం వంటి రంగాల్లో పరిశోధన సహకారాన్ని విస్తరించుకోవడానికి నేడు మేం అంగీకరించాం.

ఇంజినీరింగ్ఏఐసైబర్డిజిటల్ సాంకేతికతల వంటి రంగాల్లో భవిష్యత్ సన్నద్ధంగా మా భాగస్వామ్యాన్ని నిలపడం కోసం మా విశ్వవిద్యాలయాలనుఅంకుర సంస్థలను అనుసంధానిస్తాంనైపుణ్యాభివృద్ధిప్రతిభావంతుల రాకపోకల్లో మన సహకారం కూడా మరింతగా విస్తరించనుంది.

మిత్రులారా,

ఆర్కిటిక్ ప్రాంతంలో నార్వే ఒక ముఖ్యమైన దేశంఆర్కిటిక్ధ్రువప్రాంత పరిశోధనల్లో మన సహకారం దీర్ఘకాలికమైనదిమన దేశ ఆర్కిటిక్ పరిశోధన కేంద్రం ‘హిమాద్రి’ కార్యకలాపాలకు సహకరిస్తున్న నార్వేకు కృతజ్ఞతలుభారత అంతరిక్ష పరిశోధన సంస్థనార్వేజియన్ అంతరిక్ష సంస్థ మధ్య ఈ రోజు కుదురుతున్న అవగాహన ఒప్పందం మా అంతరిక్ష సహకారంలో కొత్త కోణాలను ఆవిష్కరిస్తుంది.

ఈ అన్ని రంగాల్లో బలమైన సహకారం ద్వారా.. వాతావరణ మార్పును అర్థం చేసుకోవడానికిసున్నితమైన పర్యావరణ వ్యవస్థలను పరిరక్షించడానికిమానవాళి భవిష్యత్తును సురక్షితం చేయడానికి మన శాస్త్రవేత్తలు కృషి చేస్తారు.

మిత్రులారా,

భారత్నార్వే మధ్య పర్యావరణ హిత వ్యూహాత్మక భాగస్వామ్యం ప్రపంచం మొత్తానికి ప్రయోజనకరంగా ఉంటుందిఇండో – పసిఫిక్ మహాసముద్ర కార్యక్రమంలో ఈ రోజు నార్వేకు రావడం సంతోషదాయకం.

సముద్ర ఆర్థిక వ్యవస్థసముద్ర భద్రతసామర్థ్యాభివృద్ధిలో సహకారాన్ని బలోపేతం చేసుకునేందుకు రెండు ప్రధానమైన నౌకావాణిజ్య దేశాలుగా మేం కలిసి పనిచేస్తాంఈ రోజు మేం త్రిముఖ అభివృద్ధి సహకార ఒప్పందాన్ని కుదుర్చుకున్నాంభారత డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల ద్వారా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మానవాభివృద్ధి కోసం మేమిప్పుడు కలిసి పనిచేస్తాం.

మిత్రులారా,

నిబంధనల ప్రాతిపదికన క్రమబద్ధతచర్చలుదౌత్యాన్ని భారత్నార్వే విశ్వసిస్తాయిసైనిక ఘర్షణ ద్వారా ఏ సమస్యనూ పరిష్కరించలేమని మేం ఏకీభవిస్తున్నాంఉక్రెయిన్ అయినాపశ్చిమాసియా అయినా.. ఘర్షణలకు త్వరితగతిన ముగింపు పలికిశాంతిని పునరుద్ధరించే ప్రతి చర్యకూ మేం మద్దతిస్తాంభవిష్యత్తులోనూ ఆ ప్రయత్నాలకు అండగా ఉంటాం.

పెరుగుతున్న అంతర్జాతీయ సవాళ్ల పరిష్కారం కోసం అంతర్జాతీయ సంస్థల సంస్కరణ అత్యావశ్యకమన్న విషయంలోనూ మేం ఏకీభవిస్తున్నాంఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నాఅది ఏ రకంగా వ్యక్తమయినా దాన్ని నిర్మూలించడం మన ఉమ్మడి బాధ్యత.

గౌరవనీయులారా,

ఆర్కిటిక్ నుంచి అంతరిక్షం దాకాపర్యావరణ హిత షిప్పింగ్ నుంచి సాగర ఆర్థిక వ్యవస్థ దాకాఇంధన భద్రత నుంచి ఆహార భద్రత దాకా… మన సహకారం కొత్త శిఖరాలను చేరుతోందివిశ్వసనీయభవిష్యత్ దృక్పథంతో కూడినదీర్ఘకాలిక భాగస్వామ్యం దిశగా మన పర్యావరణ హిత వ్యూహాత్మక భాగస్వామ్యం ద్వారా కొత్త అధ్యాయాన్ని లిఖిద్దాం.

ధన్యవాదాలు.

గమనికప్రధానమంత్రి ప్రసంగానికి ఇది ఇంచుమించుగా చేసిన అనువాదంమౌలిక ప్రసంగం హిందీలో ఉంది.  

***

\