పిఎంఇండియా
న్యూఢిల్లీలో ఈ రోజు జపాన్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ తొషిమిత్సు మోతెగి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలుసుకున్నారు.
ప్రపంచంలో ఇండో-పసిఫిక్ సహా ఇతర ప్రాంతాల్లో శాంతి, స్థిరత్వం, సౌభాగ్యం దిశగా భారత్-జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక, అంతర్జాతీయ భాగస్వామ్యానికిగల కీలక పాత్రను శ్రీ మోదీ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.
ఈ ప్రాంతంతోపాటు ప్రపంచ ఉమ్మడి ప్రయోజనాల దృష్ట్యా భారత్, జపాన్ సహకారం మరింత విస్తృతం, బలోపేతం చేసుకోవాల్సిన ఆవశ్యకతపై వారిద్దరూ చర్చించారు.
ఈ సమావేశంపై సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా ప్రజలతో పంచుకున్న సందేశంలో:
“జపాన్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ తొషిమిత్సు మోతెగీకి స్వాగతం పలకడం నాకెంతో సంతోషాన్నించ్చింది. ఇండో-పసిఫిక్ సహా ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో శాంతి, స్థిరత్వం, సౌభాగ్యం ఇనుమడింపజేయడంలో భారత్-జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక, అంతర్జాతీయ భాగస్వామ్యానికిగల కీలక పాత్రను మేం పునరుద్ఘాటించాం” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
***
Delighted to receive Mr. Toshimitsu Motegi, Minister for Foreign Affairs of Japan. Reaffirmed the vital role of the India-Japan Special Strategic and Global Partnership in advancing peace, stability and prosperity across the Indo-Pacific and beyond.@moteging pic.twitter.com/39AB2xN6FD
— Narendra Modi (@narendramodi) May 26, 2026