పిఎంఇండియా
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం ఈ రోజు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ ప్రజలు నూతన ఆవిష్కరణలకు సంబంధించిన ఆలోచనలకీ, ఔత్సాహిక పారిశ్రామిక తత్వానికీ ప్రసిద్ధి చెందారని ప్రధానమంత్రి అన్నారు. రాష్ట్రానికి ఉన్న వైభవోపేత సంస్కృతినీ, ధైర్య సాహసాలతో పాటు దృఢసంకల్పాన్నీ ఆయన ప్రశంసించారు. ‘వికసిత్ భారత్’ కలను సాకారం చేసే క్రమంలో తెలంగాణ అభివృద్ధి ప్రయాణానికీ తోడ్పాటును అందించాలని కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని శ్రీ మోదీ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజలకు ఆరోగ్యంగా ఉంటూ, విజయ పథంలో పురోగమించాలని ఆయన ప్రార్థించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి శ్రీ మోదీ పొందుపరుస్తూ :
‘‘తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం విశిష్ట సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు. నూతన ఆవిష్కరణలకు సంబంధించిన ఆలోచనలకీ, ఔత్సాహిక పారిశ్రామిక తత్వానికీ తెలంగాణ ప్రజలు ప్రసిద్ధి చెందారు. ఈ రాష్ట్రం తన వైభవోపేత సంస్కృతికీ, చరిత్రకీ మారు పేరు. వికసిత్ భారత్‌ను ఆవిష్కరించాలనే మన కలను పండించుకోవడంలో భాగంగా తెలంగాణ అభివృద్ధి ప్రయాణానికి తోడ్పాటును అందించడానికీ కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ రాష్ట్ర ప్రజలకు మంచి ఆరోగ్యం, విజయం కలగాలని ప్రార్థిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.
***
Greetings to the people of Telangana on the special occasion of Telangana Statehood Day. The people of Telangana are known for their spirit of innovation and enterprise. The State is known for its glorious culture and history...one of courage and determination. The Central…
— Narendra Modi (@narendramodi) June 2, 2026
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు.తెలంగాణ ప్రజలు తమ సృజనాత్మకతకు, వ్యాపార దృక్పథానికి ప్రసిద్ధులు. ఈ రాష్ట్రం ధైర్యానికి, సంకల్పానికి,పోరాట స్ఫూర్తికి ప్రతీకగా నిలిచిన గొప్ప చరిత్ర, వైభవోపేతమైన సంస్కృతిని కలిగి ఉంది.
— Narendra Modi (@narendramodi) June 2, 2026
వికసిత భారత్…