Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఐక్యత, పరస్పర సహకారం, సమష్టి సంకల్పానికున్న శక్తిని వివరించే సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి


ఐక్యతపరస్పర సహకారమనే బంధాలతో ప్రజలందరూ ఏకమైనప్పుడు దేశానికున్న శక్తి అనేక రెట్లు పెరుగుతుందని తెలియజేసే సంస్కృత సుభాషితాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రజలతో పంచుకున్నారుభారత ప్రజలకున్న ఈ సమష్టి సంకల్పంతోనే ప్రగతిపథంలో దేశం కొత్త శిఖరాలను అధిరోహిస్తోందని శ్రీ మోదీ స్పష్టం చేశారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి:

ఐక్యతపరస్పర సహకారమనే సూత్రంతో ప్రజలు ఏకమైనప్పుడుదేశానికున్న శక్తి అనేక రెట్లు పెరుగుతుందిభారత ప్రజలకున్న ఈ సమష్టి సంకల్పంతోనే అభివృద్ధిలో నూతన శిఖరాలను మన దేశం అధిరోహిస్తోంది.

ధూమాయంతే వ్యపేతాని జ్వలంతి సహితాని చ।

ధృతరాష్ట్రోల్ముకానీవ జ్ఞాతయో భరతర్షభ।।

ఒక చెక్క ముక్క విడిగా తన శక్తిని ప్రదర్శించలేదుఅనేక చెక్క ముక్కలు కలిసినప్పుడు అవి పూర్తిస్థాయిలో వెలుగునీవెచ్చదనాన్నీ అందించగలవుఅదే విధంగా ఒక దేశం పురోగతిసంక్షేమంబలం దాని ప్రజల ఐక్యతపరస్పర సహకారంసామూహిక సంకల్పంపై ఆధారపడి ఉంటాయి.

 

***