పిఎంఇండియా
కేంద్ర మంత్రి శ్రీ చిరాగ్ పాస్‌వాన్ రాసిన ఒక వ్యాసాన్ని ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పంచుకున్నారు. లద్దాఖ్‌లో అందుబాటులోకి వస్తున్న కొత్త అవకాశాలను గురించి ఆ వ్యాసంలో శ్రీ చిరాగ్ పాస్‌వాన్ వివరించారు.
లద్దాఖ్ లో విశేషంగా పండే బెరీలు నూతన ఆవిష్కరణలతో పాటు అవకాశాల నూతన గాథను లిఖిస్తున్నాయని ప్రధానమంత్రి అన్నారు. ఔత్సాహిక పారిశ్రామికత్వం, విలువ పెంపు విధానాలు లద్దాఖ్‌లో సమృద్ధికి సంబంధించిన కొత్త అవకాశాలను ఏ విధంగా అందుబాటులోకి తీసుకు వస్తున్నాయో కేంద్ర మంత్రి రాసిన వ్యాసం వివరంగా చెప్పిందని శ్రీ మోదీ తెలిపారు. స్థానిక వస్తువులను కొనుగోలు చేయడానికి మొగ్గు చూపే దశను మించి, ప్రపంచ మార్కెట్లకు చేరువయ్యే దిశగా భారత్ ఎలా పయనిస్తోందో మంత్రి వ్యాసం తెలియజేసిందని ఆయన అన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:
‘‘లద్దాఖ్‌కు చెందిన దేశవాళీ బెరీ నూతన ఆవిష్కరణతో పాటు అవకాశాలతో ముడిపడిన ఒక కొత్త గాథను రచిస్తోంది.
లద్దాఖ్‌లో ఔత్సాహిక పారిశ్రామికత్వం, విలువ పెంపుదల విధానాలు ఏ రకంగా సమృద్ధికి సంబంధించిన కొత్త అవకాశాలను ఎలా అందిస్తున్నదీ తప్పక పరిశీలించదగిన ఈ వ్యాసంలో కేంద్ర మంత్రి శ్రీ చిరాగ్ పాస్‌వాన్ వివరించారు. ‘స్థానిక ఉత్పాదనలనే కొనుగోలు చేయడానికి మొగ్గు చూపే దశను దాటి, ఆయా ఉత్పాదనలను ప్రపంచ దేశాల మార్కెట్లకు చేరువగా తీసుకుపోయే స్థితికి మన ప్రయత్నాలు పుంజుకుంటున్నాయన్న సమాచారాన్నిచ్చిన ఈ వ్యాసం అందించింది’’ అని పేర్కొన్నారు.
***
A berry native to Ladakh is scripting a story of innovation and opportunity.
— PMO India (@PMOIndia) June 3, 2026
A compelling reflection by Union Minister Shri @iChiragPaswan on how entrepreneurship and value addition are unlocking new avenues of prosperity in Ladakh!
An insightful read on how we are advancing… https://t.co/OpP3fbEK9i