Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భారత ప్రధానితో బ్రిటన్ విదేశాంగ కార్యదర్శి భేటీ


బ్రిటన్ విదేశాంగ మంత్రి యెవెట్ కూపర్ ఈ రోజు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు.

ఈ సమావేశం పట్ల ప్రధానమంత్రి శ్రీ మోదీ హర్షం వ్యక్తం చేశారుఇరుదేశాలకు మునుపెన్నడూ లేనివిధంగా విస్తృతమైన అభివృద్ధి అవకాశాలను అందిస్తున్న భారత్ – బ్రిటన్ భాగస్వామ్యం ఇటీవలి కాలంలో బలోపేతమవడాన్ని ఆయన అభినందించారు.

భారత్ – యూకే విజన్ 2035 నిరంతర మార్గనిర్దేశంలో ఈ భాగస్వామ్యం ఇలాగే కొనసాగుతుందనిప్రపంచ శ్రేయస్సు దిశగా ఉమ్మడి కృషిని మరింత బలోపేతం చేస్తుందని ప్రధానమంత్రి శ్రీ మోదీ స్పష్టం చేశారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

‘‘బ్రిటన్ విదేశాంగ మంత్రి యెవెట్ కూపర్‌ను కలవడం ఆనందంగా ఉంది. ఇటీవలి కాలంలో భారత్ – బ్రిటన్ భాగస్వామ్యం బలోపేతమవడం అభినందనీయంమన రెండు దేశాలకూ మునుపెన్నడూ లేనంత విస్తృతంగా అభివృద్ధి అవకాశాలను ఈ భాగస్వామ్యం అందిస్తోంది.

భారత్ – యూకే విజన్ 2035 మార్గనిర్దేశంలో మన భాగస్వామ్యం నిరంతరాయంగా కొనసాగుతుందిప్రపంచ శ్రేయస్సు దిశగా మన ఉమ్మడి ప్రయత్నాలను బలోపేతం చేస్తుంది’’.

***